हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

AP Weather: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..

Anusha
AP Weather: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థలు ముఖ్య గమనిక జారీ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా, రాబోయే రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.వాతావరణ శాఖ (Department of Meteorology) అంచనాల ప్రకారం, ఆగస్టు 18 నాటికి వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు మరింత ఉధృతం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, రాబోయే రోజుల్లో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకారం, రాబోయే మూడు రోజులు కోస్తా ఆంధ్ర జిల్లాలు వర్షాల ప్రభావానికి లోనవుతాయి. ముఖ్యంగా, చెదురుమదురుగా భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ జిల్లా (Rayalaseema District) ల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.బంగాళాఖాతం ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున, సముద్రం ఉప్పొంగే అవకాశం ఉంది. అందువల్ల మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టంగా సూచించారు. మత్స్యకారులు భద్రతా చర్యలు పాటించాలని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

మరోవైపు అల్పపీడనాల ప్రభావంతో ఆదివారం రోజున అల్లూరి సీతారామరాజు జిల్లా , విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.మరోవైపు జూలై వరకూ ఆంధ్రప్రదేశ్‌లో లోటు వర్షపాతం ఉండేది.

వర్షపాతం నుంచి అధిక వర్షపాతం జాబితాలోకి

నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించినప్పటికీ.. ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో జూన్, జూలై మాసాలలో లోటు వర్షపాతం నమోదైంది. అయితే ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మరో మూడు రోజులు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.దీంతో కొన్ని జిల్లాలు లోటు వర్షపాతం నుంచి అధిక వర్షపాతం జాబితాలోకి వచ్చి చేరాయి. పల్నాడు, బాపట్ల, గుంటూరు. కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలు అధిక వర్షపాతం నమోదైన జాబితాలోకి చేరాయి. మరోవైపు ఆగస్ట్ నెలాఖరు వరకూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని అంచనా. ఈ నేపథ్యంలో ఆగస్ట్ నెల చివరి వరకూ రాష్ట్రంలో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-where-is-the-tenth-grade-student-who-gave-birth-to-a-baby-boy/crime/531494/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870