రూ.4150 కోట్లతో మెట్రో రైలు కార్పొరేషన్ టెండర్లు
AP Metro: రాజంపేట : ఎట్టకేలకు విజయవాద మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్ పడింది. ఎపి మెట్రో కార్పొరేషన్ విజయవాడ మెట్రో నిర్మాణా అంతర్జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్ ను ఆహ్వానించిం 4150 కోట్ల అంచనా వ్యయంతో ఇపిసి మోడల్లో (EPC Model) మెట్రో రైల్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. 32 స్టేషన్లను నిర్మించనున్నారు. ఒకభూగర్భ మెట్రో స్టేషన్ కూడా ఈ పనుల్లో భాగంగా నిర్మిస్తారు. గన్నవరం నుంచి నెహ్రూ బస్ స్టేషన్ వరకు ఒక కారిడారిగా నిర్మిస్తారు.

నెహ్రు బస్టాండ్ నుంచి పెనమలూరు దాకా మెట్రో కారిడార్
AP Metro: నెహ్రు బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు మరో కారిడార్ గా నిర్మిస్తారు. డబుల్ డెక్కర్ నాలుగు వరసల ఫ్లైఓవర్ నిర్మాణంకూడా మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా చేపడతారు. ఫస్ట్ పేజ్ కింద ఈ నిర్మాణం పనులను చేపడుతున్నట్లు టెండర్లలో ఎపి మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది.
మొత్తం ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలని టెండర్ షరతు విధించింది. 24 నెలల లోపే డబల్ డెక్కర్ (Double Decker) నాలుగు వరసల ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎపి మెట్రో రైల్ కార్పొరేషన్ సోమవారం టెండర్లను ఆహ్వానించింది. ఆగస్టు 4 నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఏపీలో మెట్రో ఉందా?
ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (APMRC) అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ఇది విజయవాడలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది, ఇది విజయవాడ మెట్రో మరియు విశాఖపట్నం మెట్రోలను నిర్వహిస్తుంది.
విజయవాడలో మెట్రో ఉందా?
విజయవాడ: రెండు కారిడార్లను విస్తరించి, 33 స్టేషన్లతో మొత్తం 38.40 కిలోమీటర్లను కవర్ చేసే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ నగరంలో పట్టణ చైతన్యాన్ని గణనీయంగా పెంచుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Naga Babu : ఏపీలో వైసీపీ 20 ఏళ్లు రాదు