AP-Inter-Board-Remove-Inter-1st-Year-Exams

ఏపీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగింపు..

అమరావతి: ఏపీలో ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇంటర్ ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్ ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నాం. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని భావిస్తున్నాం.

Advertisements
image
image

జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపట్టాం. 2024-25 నుంచి పదోతరగతిలో ఎన్సీఈఆర్టీ టెక్ట్స్ బుక్స్ ప్రవేశపెట్టారు. విద్యావేత్తల నుంచి, ఇంటర్ విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి విలువైన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నాం. సైన్స్, ఆర్ట్స్, ల్యాంగ్వేజ్ సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని కృతికా శుక్లా వెల్లడించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఫస్టియర్ ఎగ్జామ్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తాజా నిర్ణయాలతో పాటు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్‌ను ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఇది జాతీయ స్థాయిలో సమన్వయాన్ని పెంచుతుందని, విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధం కావడానికి ఉపకరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల ప్రగతిపై సానుకూల ప్రభావం చూపుతుందా లేదా అన్నది భవిష్యత్‌లో తెలుస్తుంది.

Related Posts
Sunita Williams: అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపించింది : సునీతా విలియమ్స్
అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపించింది : సునీతా విలియమ్స్

అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించిందని భారత సంతతి అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్​ఎస్) హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడల్లా మంచుకొండల Read more

ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్స్టాపబుల్ – చంద్రబాబు
CBN davos

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత్ అభివృద్ధిని ప్రశంసించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్ గ్లోబల్ మర్చంట్‌గా Read more

Telangana : తెలంగాణలో రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ
Distribution of fine rice from tomorrow in Telangana

Telangana : తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి కూడా సన్న బియ్యం అందించే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయంపై సివిల్ సప్లైస్, Read more

YS Sunitha: వివేకా హత్య కేసు లో మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది సునీత ఆవేదన
వివేకా హత్య కేసు లో మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది సునీత ఆవేదన

వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ సునీత నివాళులు అర్పించారు. పులివెందులలోని వివేకా సమాధి వద్ద ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులతో Read more

×