ఇంద్రకీలాద్రి : దుర్గమ్మవారిని ఏపి హైకోర్టు (High court) చీఫ్ జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఇఓ వికె శీనా నాయక్ దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందించారు. వేదపండి తులు వేదాశీర్వచనాలు పలికారు. శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో ఆదివారం సూర్యోసాపసనను వేదోక్తంగా జరిపారు. నిత్యాన్నదానానికి విరాళం: దుర్గమ్మ ఆలయంలో జరిగే నిత్యాన్నదాన పథకానికి రు.1లక్షను విరాళంగా ఏలూరుకు చెందిన వెంకట గౌరి గిరి సాయి బాలాజీ వారి తల్లిదండ్రులు చిత్త నిత్యాన్నదాన పథకానికి విరాళమిచ్చిన దాతలకు దుర్గమ్మవారి జ్ఞాపిక అందిస్తున్నారు. ఆలయంలో ఆదివారం చెన్నైకు చెందిన నికేతన్ కూచిపూడి డ్యాన్స్ అకాడమి ఆచార్యులు డా మాధవి మల్లంపల్లి నేతృత్వంలో విద్యార్థుల దుర్గమ్మ వైభవాన్నీ కీర్తిస్తూ నృత్యనీరాజనాలర్పించి భక్తులను ఆకట్టుకున్నారు. అనంతరం వారికి దుర్గమ్మవారి దర్శనం ఏర్పాటు చేసిన అధికారులు, దుర్గమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రసాదం, మెమొం టోలు వేదపండితులు అందించారు. వేదాశీర్వచనాలు పలికారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Former ministers : నీలకంఠాపురంలో మాజీ మంత్రులు జానారెడ్డి, రఘువీరా భేటీ