నివేదికల నేపథ్యంలో
విజయవాడ : రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు అంశంపై ఏపీ హైకోర్టు సందేహాన్ని వ్యక్తం చేసింది. ఈ అంశంపై అడ్వోకేట్ కమిటీ వేస్తామని వెల్లడించారు. ఒక హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సందర్భంగా విజయవాడ మూడవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నివేదికను హైకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఒక సీసీ కెమెరా మాత్రమే ఉన్నట్లు మేజిస్ట్రేట్ నివేదికలో పేర్కొన్నారని గుర్తుచేసింది. అయితే, స్టేషన్ను వ్యక్తిగతంగా తనిఖీ చేసి ఠాణా మొత్తం కవర్ అయ్యేలా సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్లు విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సర్టిఫై చేస్తూ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. పరస్పర భిన్న నివేదికల నేపథ్యంలో ఎన్డీపీవోలు సమర్పించిన నివేదికల వాస్తవికతను తేల్చేందుకు అడ్వొకేట్ కమిటీ (Advocate Committee) ని ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పోలీసుస్టేషన్లలో పర్యటించి ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? స్టేషన్ మొత్తం కనిపించేలా ఏర్పాటు చేశారా?లేదా? తదితర అంశాలపై కమిటీ నుంచి నివేదిక కోరతామని పేర్కొంది.
జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్ని స్టేషన్లలో సీసీకెమెరాలు ఏర్పాటు చేయలేదో వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎసజీపీ)ని ఆదేశిస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్. రఘునందనరావు, జస్టిస్ జగడం సుమతితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయవాది తాండవ యేగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ఆ మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2019 జూలై 15న ఆదేశాలిచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఉత్తర్వులు అమలుకాకపోవడంతో యోగేష్ 2022లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లో
మరోవైపు పల్నాడుజిల్లా, మాచవరం పోలీసులు తన సోదరుడు గోపిరాజును అక్రమంగా నిర్బంధించారంటూ కటారు నాగరాజు గతేడాది నవంబరులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని పోలీసు యంత్రాంగం ఏపీ హైకోర్టు (AP High Court) కు వివరించింది. ఇందుకు సంబంధించి ఆయా డిఎస్ పిలు రూపొందించిన నివేదికలు హైకోర్టుకు సమర్పించారు. పోలీస్ స్టేషన్ లోపల, బయట కనబడేలా వాటిని ఏర్పాటు చేశామన్న నివేదికలపై హైకోర్టు సందేహాలను లేవనెత్తింది. సిసి కెమెరాల ఏర్పాటుపై వాస్తవాల నిర్ధారణ కోసం అడ్వకేట్స్ కమిటీ వేస్తామని స్పష్టం చేసింది. పోలీసులు ఇచ్చిన నివేదికకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకూ పొంతన లేదని వ్యాఖ్యానించింది.
సైబర్ క్రైమ్
విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్సే నిదర్శనమని చెప్పింది. చాలా పిఎస్లలో సిసి కెమెరాలను ఏర్పాటు ఎందుకు చేయలేదో చెప్పాలంది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అన్నీ కనిపించేలా సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ నివేదిక ఇచ్చారని, ఇక్కడికి చెందిన మరో కేసులో సంబంధిత మెజిస్ట్రేట్ మాత్రం కేవలం ఒక్క సిసి కెమెరా ఉందని తమకు నివేదిక ఇచ్చారని చెప్పింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఉత్తర్వుల మేరకు అన్ని పిఎస్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2019లో వేసిన పిల్ను మంగళవారం జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ జగడం సుమతితో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్రంలో 1,392 పోలీస్ స్టేషన్లు ఉంటే 1,001 స్టేషన్లలో మాత్రమే సిసి కెమెరాలు ఉన్నాయని పిటిషనర్ వాదన. లాకప్లున్న అన్ని పిఎస్లలో ఏర్పాటు చేశామని ప్రభుత్వ వాదన. లాకప్లు లేనిచోట కెమెరాలు పెట్టలేదని చెప్పింది.
ఏపీ హైకోర్టు ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలోని జస్టిస్ సిటీ, న్యాయవాడ ప్రాంతంలో ఉంది. ఇది గుంటూరు జిల్లా పరిధిలో వస్తుంది.
ఏపీకి స్వతంత్ర హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది?
తెలంగాణ విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌కు స్వతంత్ర హైకోర్టు 1 జనవరి 2019 నుండి అమల్లోకి వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com