ఏపీ చేనేత రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో చేనేత కార్మికుల (Handloom workers) కు మద్దతుగా నూతన విధానాలు అమలు చేయాలని నిర్ణయించింది. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసింది.

చేనేత కుటుంబాలపై సీఎం ప్రత్యేక దృష్టి
రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో చేనేత రంగ భవిష్యత్తుపై చర్చ జరిగింది. ఇటీవల జమ్మలమడుగు (Jammalamadugu)లో చేనేత కుటుంబం (Handloom workers) తో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, వారి సమస్యలు తన దృష్టికి వచ్చాయని సీఎం పేర్కొన్నారు.
మగ్గాలకు ఉచితంగా విద్యుత్
చేనేత మగ్గాలకూ, పవర్ లూమ్లకూ విద్యుత్ సబ్సిడీగా ప్రభుత్వం ముందుకు వచ్చింది. మానవచేతితో నడిచే మగ్గాలకు నెలకు 200 యూనిట్లు మరియు పవర్ లూమ్స్‌కు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత శాఖలు వెంటనే అమలుకు చర్యలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
హ్యాండ్లూమ్ వస్త్రాలకు జీఎస్టీ మినహాయింపు
చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీని ఇకపై రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ప్రజలకు తక్కువ ధరలో చేనేత వస్త్రాలు అందేలా చేయడంతో పాటు, నేతన్నలకు ఆదాయం పెరగడం దీని ఉద్దేశం. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చే నిర్ణయంగా ప్రభుత్వం వెల్లడించింది. చేనేత కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, రూ. 5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ (పొదుపు నిధి)ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇది కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడనుంది.
జాతీయ చేనేత దినోత్సవం నుంచే అమలు
ఈ నిర్ణయాలను ఆగస్ట్ 7 (జాతీయ చేనేత దినోత్సవం) నాటికి అమలులోకి తీసుకురావాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో చేనేత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: