సంక్రాంతి బరిలో ఒకటి , రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సిని మాలు బరిలోకి దిగుతున్నాయి. ముందుగా శంకర్ – రామ్ చరణ్ కలయికలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 న పాన్ ఇండియా గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దాదాపు మూడేళ్ళ పాటు నిర్మితమైన ఈ మూవీ కోసం మెగా అభిమానులే కాదు యావత్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
జనవరి 12 న నందమూరి బాలకృష్ణ – బాబీ కలయికలో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కాబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ నిర్మించిన ఈ మూవీ పై కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వరుస హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య..డాకు మహారాజ్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని అభిమానులు ధీమా గా ఉన్నారు.
వీటితో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కూడా జనవరి 14 న రిలీజ్ అవుతుంది. వెంకటేష్ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కిన ఈ మూవీ పై ఫ్యామిలీ ఆడియన్స్ లలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించి మేకర్స్ లలో సంతోషం నింపింది.
గేమ్ ఛేంజర్ తొలిరోజు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. JAN 10న అర్ధరాత్రి ఒంటిగంట షో (బెన్ఫిట్)కు టికెట్ రూ.600కు అమ్ముకోవచ్చని తెలిపింది. మిగతా 5 షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్పై రూ.175, సింగిల్ స్క్రీన్లపై రూ.135 హైక్ ఇచ్చింది. 23వ తేదీ వరకూ రోజుకు ఐదు షోలకు హైక్తో టికెట్స్ విక్రయించుకోవచ్చని చెప్పింది.
డాకు మహారాజ్ సినిమా రిలీజయ్యే జనవరి 12న ఉ.4 గంటలకు బెనిఫిట్ షో టికెట్ రేటును రూ.500గా నిర్ణయించింది. ఫస్ట్ డే నుంచి జనవరి 25 వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. వాటికి మల్టీప్లెక్సుల్లో టికెట్పై రూ.135, సింగిల్ స్క్రీన్లపై రూ.110 హైక్ ఇచ్చింది.