AP government handed over the investigation of actress Kadambari Jethwani case to CID

నటి కాదంబరీ జత్వానీ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: బాలీవుడ్ నటి కాదంబరీ జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేశారు. జత్వానిపై అక్రమంగా కేసు నమోదు, అరెస్టు వ్యవహారంలో పలువురు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారుల ప్రమేయం బయటపడడంతో దీని వెనుక సూత్రధారులను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు అవసరమని ప్రభుత్వం భావించింది.

దీంతో ఈ కేసులకు సంబంధించి అన్ని రికార్డులను సీఐడీకి అప్పగించాలంటూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జత్వాని ఫిర్యాదు మేరకు నాటి పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జత్వాని కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Related Posts
G7 సమావేశంలో ట్రంప్ విధానాలపై ప్రతికూల స్పందన
G7 సమావేశంలో ట్రంప్ విధానాలపై ప్రతికూల స్పందన

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో గ్రూప్ ఆఫ్ 7 (G7) సమావేశానికి హాజరైనప్పుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా భాగస్వామి దేశాల Read more

ఏపీలో కొత్తగా మరో 4 లైన్ల రహదారి
4line highway line Ap

తిరుమల వెళ్లే వారికీ గుడ్ న్యూస్ తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు వేలాదిగా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. Read more

పీఎంజే జ్యూవెల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సితార
Sitara Ghattamaneni PMJ Jew

పీఎంజే జ్యూవెల్స్ మరో సరికొత్త క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. పీఎంజే జ్యూవెల్స్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార బ్రాండ్ అంబాసిడర్ గా Read more

డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం
CM Revanth Reddy will go to Maharashtra today

డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ ముందు నుండి కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి , డ్రగ్స్ , Read more