ap state logo

మ‌రో ప‌థ‌కం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

ap state logo
ap state logo

అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పరిపాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే పథకాల పేర్లను సర్కార్ మారుస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా జగన్ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన ‘జగనన్న తోడు’ పథకం పేరును మార్చేసింది. ఈ మేరకు ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరును మారుస్తూ సీఎస్ నీరబ్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పథకం పేరు మార్చాలంటూ గ్రామ సచివాలయాల నుంచి పెద్ద ఎత్తున విజ్క్షప్తులు రావడంతో పథకం పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తులు, హస్త కళాకారులు ప్రభుత్వం నుంచి రూ.10 వడ్డీ లేని రుణాన్ని పొందనున్నారు.

కాగా, గత వైఎస్‌ జ‌గ‌న్‌ ప్రభుత్వం చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, హస్త కళాకారుల కోసం ‘జగనన్న తోడు’ పథకం కింద రూ. 10వేల ఆర్థిక సాయం అందించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరికి ఏటా వడ్డీలేని రూ.10 వేల రుణం అందించారు.

Related Posts
వరల్డ్ స్ట్రోక్ డే 2024: స్ట్రోక్ సంఘటనలు పెరుగుతున్నందున పునరావాస మరియు పునరుద్ధరణ కేంద్రాల యొక్క అత్యవసర అవసరాన్ని వెల్లడించిన హెచ్‌సిఏహెచ్
World Stroke Day 2024. HCAH reveals urgent need for rehabilitation and recovery centers as stroke incidence rises

హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ డే 2024 న, తెలంగాణలో స్ట్రోక్ కేసుల ప్రాబల్యం పై ప్రధానంగా దృష్టి సారించింది , ఇది రక్తపోటు, మధుమేహం, ధూమపానం మరియు Read more

మిర్చి రైతులకి మేలు చేయాలి : సీఎం చంద్రబాబు
మిర్చి రైతులకి మేలు చేయాలి : సీఎం చంద్రబాబు

న్యూఢిల్లీ: సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి ధరలు Read more

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. హరిత శక్తి మరియు Read more

విచారణకు హాజరైన పేర్ని జయసుధ
jayasuda police22

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బందరు తాలుకా Read more