AP Cyclone Dana

ఏపీకి ‘దానా’ తుఫాను ముప్పు

బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర తుఫానుగా బలపడొచ్చని పేర్కొంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటొచ్చని భావిస్తోంది. దీని ప్రభావంతో విజయనగరం, మన్యం, శ్రీకాకుళం(D)ల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది.

Advertisements

ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 4 రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లో.. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒడిశాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ దానా తుఫాన్ ఈనెల 24వ తేదీన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ దానా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఏపీ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే సమయంలో మరింత భీకరమైన గాలులు, వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఈ దానా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధం అయ్యాయి.

Related Posts
బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు ఊరట..
Relief for battalion consta

తెలంగాణ బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల నిరసనలు ఫలవంతమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన సెలవుల జీవో పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు, ఈ Read more

ఆలయ హుండీలో 2000 నోట్లు చలామణి
వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో రూ.2 వేల నోట్ల ప్రత్యక్షం

దేశవ్యాప్తంగా రూ.2 వేల నోట్ల చెలామణి 2023లో రద్దైన విషయం అందరికీ తెలుసు. అయితే, ఆ నోట్లు ఇప్పుడు బయటపడటమే కాదు, ఓ ఆలయ హుండీలో కనిపించడం Read more

రికార్డులు సృష్టించిన కేన్ మామ
Kane Williamson

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన అద్భుత ఆటతో కొత్త రికార్డులను నమోదు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. తాజాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అన్ని Read more

కేసీఆర్ కు కిషన్ రెడ్డి పార్ట్నర్ – సీఎం రేవంత్
kcr kishan revanth

తెలంగాణలో రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. "కేసీఆర్ కోసం కిషన్ రెడ్డి Read more

×