AP Cyclone Dana

ఏపీకి ‘దానా’ తుఫాను ముప్పు

బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర తుఫానుగా బలపడొచ్చని పేర్కొంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటొచ్చని భావిస్తోంది. దీని ప్రభావంతో విజయనగరం, మన్యం, శ్రీకాకుళం(D)ల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది.

Advertisements

ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 4 రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లో.. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒడిశాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ దానా తుఫాన్ ఈనెల 24వ తేదీన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ దానా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఏపీ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే సమయంలో మరింత భీకరమైన గాలులు, వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఈ దానా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధం అయ్యాయి.

Related Posts
తెలంగాణ హైకోర్టులో ఖాళీలు భర్తీకి సిద్ధం
తెలంగాణ హైకోర్టులో ఖాళీలు భర్తీకి సిద్ధం

తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్, హైకోర్టు పరిధిలోని జిల్లా జ్యుడీషియరీలో ఖాళీగా ఉన్న టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ క్యాలెండర్ను రూపొందించారు. Read more

పుతిన్ మోసపూరిత చర్యలపై జెలెన్‌స్కీ ఆగ్రహం
పుతిన్ త్వరలోనే మరణిస్తారు: జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. కాల్పుల విరమణ విషయమై పుతిన్ చూపుతున్న మోసపూరిత ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. Read more

మాట్ గేట్జ్ వివాదం తరువాత, పామ్ బోండి ని అటార్నీ జనరల్ గా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
pam bondi

డొనాల్డ్ ట్రంప్, తన అటార్నీ జనరల్ పథవికి ఫ్లోరిడా రాష్ట్ర మాజీ అటార్నీ జనరల్ పామ్ బోండి ని నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనను, మాజీ Read more

రేవంత్ రెడ్డివి దిగజారుడు మాటలు- కిషన్ రెడ్డి
kishan reddy , revanth redd

రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ వ్యాఖ్యలు డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గొడవ తలెత్తింది. CM రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టుకతో BC Read more

×