AP Cabinet కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం

AP Cabinet : కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం

AP Cabinet : కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఛాంబర్‌కు వెళ్లి ప్రత్యేకంగా చంద్రబాబుతో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనా వ్యవహారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.కేబినెట్ సమావేశంలో టీచర్ల బదిలీల నియంత్రణ కోసం చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. అలాగే, రాజధానిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది.

Advertisements
AP Cabinet కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం
AP Cabinet కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం

చేనేత కార్మికుల సంక్షేమం కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయాలని, మర మగ్గాల కోసం 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించాలని నిర్ణయించారు.నంబూరులోని వీవీఐటీయూ విద్యాసంస్థకు ప్రైవేట్ యూనివర్శిటీ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.అంతేకాకుండా అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపింది. కొన్ని సంస్థలకు భూకేటాయింపులపై కూడా ఈ సమావేశంలో అనుమతులు మంజూరు చేశారు.ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది.

నివేదిక ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ చేయాలని కమిషన్ సూచించగా, కొందరు ఎమ్మెల్యేలు జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలన్న ప్రతిపాదన చేశారు.దీంతో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ చేయాలని నిర్ణయించగా, 2026 జనాభా లెక్కల తర్వాత జిల్లాను యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ చేపట్టాలని తేల్చారు. దీనికి అనుగుణంగా, అసెంబ్లీలో తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపాలని నిర్ణయించారు.అంతేకాకుండా, బుడగజంగాలు సహా మరో కులాన్ని ఎస్టీల్లో చేర్చేందుకు కేబినెట్ తీర్మానం చేసింది. వైఎస్సార్ జిల్లాను ఇకపై ‘వైఎస్సార్ కడప జిల్లా’గా పిలవాలని నిర్ణయం తీసుకుంది. పెనమలూరులోని తాడిగడప మున్సిపాలిటీకి ‘వైఎస్సార్’ పేరు తొలగించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చలు మొదలయ్యాయి.

Related Posts
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఈఓ సమీక్ష
ttd

వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈఓ Read more

2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ను ప్రకటించిన ఐఎండీబీ
IMDb Announces Most Popular

ముంబై-డిసెంబర్ 2024 : IMDb (www.imdb.com) సినిమాలు, టీవీ మరియు ప్రముఖుల సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి నేడు 2024 టాప్ 10 Read more

YS Jagan : 8న అనంత జిల్లాలో వైఎస్‌ జగన్ పర్యటన
YS Jagan visit to Ananta district on the 8th

YS Jagan : వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి Read more

రతన్ టాటా మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
Piyush Goyal breaks down re

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×