AP Cabinet meeting today

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో కేబినేట్ సమావేశం జరుగనుంది. 3 ఉచిత సిలిండర్ల పథకంపై ఈ కేబినెట్‌లో చర్చ సాగనుంది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పాలసీలపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు.

Advertisements

అలాగే పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన ఆరు పాలసీలపైనా మంత్రివర్గం చర్చించనుంది. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు.

అదేవిధంగా తిరుమలలో లడ్డూ కల్తీ ఘటన తర్వాత.. పాలకమండలిలో బ్రాహ్మణులుండాలన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలన్న ఆలోచనలో ఉంది. ఈ పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related Posts
శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌
Telangana Governor Jishnu Dev Varma visited Bhadradri Ramaiah

భద్రాచలం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తుల్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత, ఆలయానికి సమీపంలోని ఆంజనేయస్వామి Read more

Robert Vadra : రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రాబర్ట్ వాద్రా
Robert Vadra రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రాబర్ట్ వాద్రా

దేశ రాజ‌కీయాల్లో మరో కీల‌క పరిణామం చోటు చేసుకునేలా ఉంది. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన రాబర్ట్ వాద్రా, త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడతానని అధికారికంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం Read more

అమరావతి అభివృద్ధికి 50 వేల కోట్లు: సీఎం
అమరావతి అభివృద్ధికి 50 వేల కోట్లు: సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. అమరావతి చుట్టూ 183 కిలోమీటర్ల విస్తీర్ణంలో Read more

MLAs Disqualification Case: స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
Should we just sit and watch even if the Speaker takes no action? Supreme Court

MLAs Disqualification Case: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఇదివరకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, Read more

×