AP Cabinet meeting today

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో కేబినేట్ సమావేశం జరుగనుంది. 3 ఉచిత సిలిండర్ల పథకంపై ఈ కేబినెట్‌లో చర్చ సాగనుంది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పాలసీలపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు.

Advertisements

అలాగే పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన ఆరు పాలసీలపైనా మంత్రివర్గం చర్చించనుంది. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు.

అదేవిధంగా తిరుమలలో లడ్డూ కల్తీ ఘటన తర్వాత.. పాలకమండలిలో బ్రాహ్మణులుండాలన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలన్న ఆలోచనలో ఉంది. ఈ పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related Posts
రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు..ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
CBN AP Govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయోవృద్ధ తల్లిదండ్రుల హక్కులను పరిరక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తమను పట్టించుకోని పిల్లలు లేదా వారసులపై తల్లిదండ్రులు చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం Read more

సంక్రాంతికి 26 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
South Central Railway has announced 26 special trains for Sankranti

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజలు భారీగా ప్రయాణాలు చేసే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. పండుగ Read more

ఆదాయపు పన్నుపై పరిమితి పెంచిన కేంద్రం
budget

బడ్జెట్ లో వేతన జీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచింది. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు Read more

బెదిరించడం మీకే అలవాటు :నారా లోకేశ్‌
తల్లికి వందనంపై నారా లోకేష్ కీలక ప్రకటన

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు రెండో రోజు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా 19మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17 మందిని బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి Read more