AP Cabinet meeting today..discussion on these issues!

నేడు ఏపీ కేబినెట్ భేటీ..ఈ అంశాలపైనే చర్చ !

అమరావతి: నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ జరుగనుంది. SIPB ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనున్నది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై కూడా చర్చించనుంది. కాగా.. ఈ నెల 15 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండ‌లి స‌మావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై పచ్చజెండా ఊపనుంది. రిజిస్ట్రేషన్ విలువల పెంపు సహా కొన్ని కీలకమైన అంశాలపైనా నిర్ణయం తీసుకోనుంది.

image

జనవరి 30న రాష్ట్ర పెట్టుబ‌డుల పోత్సాహాక మండలి భేటీలో 15 ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా రూ.44,776 కోట్ల పెట్టుబ‌డులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఈ ప్రాజెక్ట్‌ల‌కు మంత్రివ‌ర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. అల్లూరి జిల్లాలో రూ.14,328 కోట్లతో 2300 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను నవయుగ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో రూ.10,300 కోట్లతో మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఏర్పాటు చేయ‌నున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌కూ కేబినెట్‌ గ్రీన్​సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాకినాడ, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్ జిల్లాలో ఏర్పాటయ్యే ప్రాజెక్ట్‌లను ఆమోదించే అవ‌కాశం ఉంది.

ఇక అటు ఏపీలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. జగన్ 1.0 నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదంటూ నారా లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇప్పటినుంచి జగన్ 2.0 ని చూస్తారని నిన్న వైఎస్ జగన్ కామెంట్స్‌ చేసిన సంగతి తెలసిందే. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో మీకు చూపిస్తానని వివరించారు. అయితే.. జగన్ చేసిన కామెంట్స్‌ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో అసలు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నించారు.ఎంతో మంది దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లను చంపాడని ఆరోపణలు చేశారు.

Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం: బండి సంజయ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులతో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశం Read more

కొత్తగూడెం ఏర్పాటు పర్యవేక్షణకు కేంద్ర బృందం
kothagudem airport

కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఈ నెల 20న ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేక బృందం కొత్తగూడెం వస్తుందని రాష్ట్ర మంత్రి Read more

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక తీర్పు
IAS officers did not get relief in the high court

హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని Read more

2008 డీఎస్సీ అభ్యర్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
2008 dsc candidates telanga

ఏళ్ల తరబడి ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న 2008 డీఎస్సీ అభ్యర్థులకు హైకోర్టు ఉత్తర్వులతో శుభవార్త లభించింది. 1382 పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టి, Read more