AP Cabinet meeting today

నేడు ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

image
AP Cabinet meeting today

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏపీలో అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయలేదు. ఈ పథకం ఎప్పుడెప్పుడా అమలు చేస్తారా అని రాష్ట్రంలోని మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15, అక్టోబర్ 2న, నవంబర్ 1న ఉచిత బస్సు పథకం అమలు చేస్తారని భావించినా వారికి నిరాశే ఎదురైంది. సంక్రాంతికి సైతం పథకాన్ని పట్టాలెక్కించలేదు. మరోవైపు మంత్రుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి మహిళలకు ఉచిత బస్సు పథకం తీరుతెన్నులను అధ్యయనం చేసింది. నేడు జరగనున్న కేబినెట్ భేటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారని ప్రచారం మొదలైంది.

గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయించాలని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. దీనిపై మంత్రివర్గం చర్చించి ప్రకటక చేసే ఛాన్స్ ఉంది. రైతు భరోసా సహా ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలపై చర్చిస్తారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై తర్వాత ఎజెండా అంశంపై మంత్రులు చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న తరుణంలో దీనిపై కీలకంగా చర్చ జరగనుంది. పలు ప్రాజెక్టుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఆయా కంపెనీలకు కేటాయించిన భూములకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపైనా చర్చిస్తారని సమాచారం. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించకపోవడంతో వాలంటీర్లు సీఎం చంద్రబాబును కలవనున్నారు. సీఎంను కలిసి వాలంటీర్లు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా వారిని కొసాగించడంతో పాటు వారికి రెట్టింపు జీతం ఇవ్వాలని సీఎం చంద్రబాబును వాలంటీర్లు కోరనున్నారు.

Related Posts
రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు – మంత్రి కోమటిరెడ్డి
telangana minister komatire

తెలంగాణ రాష్ట్రంలో జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ పునర్విభజనతో రాష్ట్రానికి కొత్తగా 34 అసెంబ్లీ Read more

Modi : ‘ట్రూత్ సోషల్’లో ప్రధాని మోదీ.. తొలి పోస్ట్ ఇదే
Narendra Modi శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా రంగంలో మరో ముందడుగు వేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో Read more

ISRO-NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం
ISRO NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం

ISRO-NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం ప్రతి 12 రోజులకు దాదాపు భూమి మొత్తం మరియు మంచును స్కాన్ చేస్తుంది, అలాగే ఇది అధిక రిజల్యూషన్ కలిగి ఉంటుంది. Read more

Telengana: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Telengana: కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త కార్డులు జారీ చేయకపోవటంతో, రాష్ట్రంలోని అనేక కుటుంబాలు Read more