AP Cabinet meeting concluded..Approval of many decisions

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..పలు నిర్ణయాలకు ఆమోదం

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనందించేలా ఈ పాలసీలో మార్పులు చేశారు. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు.

Advertisements
image

గతంలో పెండింగ్ లో ఉన్న నీరు-చెట్టు పనుల బిల్లుల చెల్లింపునకు ఆమోదం లభించినట్టు సమాచారం. ఇక, మద్యం ధరలపైనా, పోలవరం నిర్వాసితులకు కొత్త ఇళ్లు నిర్మించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్-2025కి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో, సుమారు రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ సమ్మతి తెలిపినట్టు తెలుస్తోంది. విశాఖ గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో వెయ్యి గజాల వరకు అభ్యంతరం లేని భూముల నిర్మాణానికి క్రమబద్ధీకరణ చేయాలనే ప్రతిపాదనపై కేబినెట్‌లో ఆమోదం లభించింది.

గతంలోనే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి సవరణ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గాజువాకను ప్రత్యేకంగా తీసుకుని ఈ ప్రాంతంలో వెయ్యి గజాల వరకు కూడా సవరణ చేయలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పట్టాదారు పుస్తకం విషయంలో కూడా చట్టసవరణకు వచ్చిన ప్రతిపాదనకు సంబంధించి మంత్రిమండలి ఆమోద ముద్ర పడింది. ఇక ఏపీ నాలెడ్జ్ సొసైటీ, కెపాసిటీ బిల్డింగ్‌ 2025కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రెండు సార్లు నగుదును రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు పోలవరం నిర్మాణం జరుగుతుండగానే.. మరోవైపు పోలవరం నిర్వాసితులకు రిహబిలిటేషన్ చేసే విధంగా కేబినెట్‌లో చర్చించారు.

Related Posts
Amaravati : పీ-4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
Amaravati పీ 4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Amaravati : పీ-4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం తన జీవిత లక్ష్యంగా Read more

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
Parliament sessions from today

న్యూఢిల్లీ: ఈరోజు ( సోమవారం )నుండి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్‌ 4వ తేదీ దాకా కొనసాగుతాయి. పలు శాఖలకు Read more

అనంతపురంలో పరువు హత్య?
honor killing

భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నా, పరువు కోసం జరుగుతున్న హత్యలు ఇంకా సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కుటుంబ పరువు, సంప్రదాయాల పేరుతో తల్లిదండ్రులే తమ పిల్లల Read more

Raja Singh : సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ
Raja Singh letter to CM Revanth Reddy

Raja Singh: ఈ నెల 6న నిర్వహించే శ్రీరామ నవమి శోభ యాత్ర ను అడ్డంకులు లేకుండా నిర్వహించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ Read more

×