AP budget.. Rs. 20 thousand per year for farmers

ఏపీ బడ్జెట్‌.. రైతులకు ఏడాదికి రూ.20వేలు

రూ.120 కోట్ల విత్తన రాయితీ బకాయిలు మాఫీ

అమరావతి: ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. వ్యవసాయరంగానికి రూ.48,340 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి సాధించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని చెప్పిన ఆయన ..గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలను ఎంపిక చేశామన్నారు. కూటమి ప్రభుత్వం 78 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ, రూ.120 కోట్ల విత్తన రాయితీ బకాయిలను మాఫీ చేసిందన్నారు.

Advertisements
ఏపీ బడ్జెట్‌  రైతులకు ఏడాదికి

రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్ష

ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం రూ.6.300 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు, సాగు నీటి ప్రాజెక్టులు రూ.11,314 కోట్లు, పోలవరం నిర్మాణం రూ.6,705 కోట్లు, భూమి లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ.20వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్‌ భారత్‌ 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.

పీఎం కిసాన్.. రూ. 6 వేలు

కాగా, ఇప్పటికే రైతన్నలకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతన్నలకు ఏటా రూ. 6వేలు జమ చేస్తోంది. కేంద్రం ఇచ్చే రూ. 6వేలకు ఏపీ ప్రభుత్వం మరో 14వేలు కలిపి ఏడాదికి రూ. 20వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించనున్నారు.

Related Posts
లాస్ ఏంజెలిస్ లో మళ్లీ మంటలు.. హెచ్చరికలు
los angeles wildfires

అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరానికి మరోసారి అగ్నిమాపక ముప్పు ఏర్పడింది. తూర్పు ప్రాంతంలోని శాంటా అనా నది వద్ద కొత్తగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం Read more

ఎంపీ రఘునందన్ రావు అరెస్ట్
mp raghunandan rao arrest

మెదక్‌ బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావును జనవరి 17న పోలీసులు అరెస్ట్ చేశారు. వెలిమల తండాలో గిరిజనుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన రఘునందన్ రావును సాయంత్రం అదుపులోకి Read more

ఆంధ్రాలో వేలల్లో ఉద్యోగావకాశాలు
chandrababu naidu

ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో రూ.14,000 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ Read more

పొదుపు, పెట్టుబడులను పెంచే బడ్జెట్: ప్రధాని మోదీ
పొదుపు, పెట్టుబడులను పెంచే బడ్జెట్: ప్రధాని మోదీ

కేంద్ర బడ్జెట్ 2025 దేశ అభివృద్ధికి అనుగుణంగా రూపుదిద్దుకున్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో Read more

×