AP Budget on March 3!

మార్చి 3న ఏపీ బడ్జెట్‌ !

ఈనెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ

అమరావతి : మార్చి 3న ఏపీ బడ్జెట్‌ ఉండనుందని సమాచారం అందుతోంది. మార్చి నెల 3 న బడ్జెట్ ప్రవేశ పెట్టె ఆలోచనలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి తర్వాత వరుసగా రెండు రోజులు సెలవలు ఉండే అవకాశం ఉండే ఛాన్సులు ఉన్నాయి. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. దీంతో ముందు అనుకున్నట్టు ఈ నెల 28 బదులుగా వచ్చే నెల 3 న బడ్జెట్ ప్రవేశ పెట్టే ఆలోచనలో సర్కార్ ఉంది.

మార్చి 3న ఏపీ బడ్జెట్‌

కాగా, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 24 తేదీ ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు. ఈ నెల 30న 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 20వ తేదీన మంత్రివర్గం సమావేశం: సచివాలయంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ కానుంది. మంత్రి వర్గంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం అన్ని మంత్రిత్వ శాఖలకు

Related Posts
పార్టీ మార్పు పై స్పందించిన డీకే శివకుమార్
DK Shivakumar reacts on party change

కర్ణాటక: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వార్తలను ఆయన ఖండించారు. బీజేపీ వాళ్లే తనతో టచ్ లో ఉన్నారని Read more

నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్
Food poisoning in Kasturba

తెలంగాణ లోని ప్రభుత్వ హాస్టల్స్ లలో , ఆశ్రమాల్లో వరుసపెట్టి ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు ఎక్కడో చోట ఫుడ్ పాయిజన్ ఘటన Read more

లాలూ ప్రతిపాదనను తిరస్కరించిన నితీష్
లాలూ ప్రతిపాదనను తిరస్కరించిన నితీష్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జెడి (రాష్ట్రీయ జనతాదళ్) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆయన, గతంలో రెండు సార్లు పొరపాటున దారి తప్పినప్పటికీ, Read more

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బాబు లోకేశ్ ఓటు
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బాబు లోకేశ్ ఓటు

ఈ రోజు ఉమ్మడి కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ Read more