AP Assembly Sessions Begin

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం

అమరావతి : ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి పార్టీ సభ్యులు సభకు హాజరయ్యారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సభ్యులు నేటి సమావేశానికి హాజరయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలుపెట్టారు. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గట్టిగా నినాదాలు చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

శాసనసభ రేపటికి వాయిదా

బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఉదయం 9.45కు సీఎం చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు. అనంతరం 9.55 కి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు గవర్నర్ కు స్వాగతం పలకనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు, సీఎం చంద్రబాబుకు అసెంబ్లీ వద్ద స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించగానే… ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినదించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ సభలో పట్టుపట్టారు. గవర్నర్ ప్రసంగం అనంతరం 11.15 కు శాసనసభ రేపటికి వాయిదా పడనుంది.

Related Posts
టోల్ ప్లాజాలపై కేంద్రం కొత్త నిర్ణయం
tollplaza

ఏదయినా పండుగల సీజన్స్ లో ఊర్లకు వెళ్ళాలి అంటేనే టోల్ ప్లాజాల వద్ద గంటల కొద్దీ వేచివుండాలి. ఇప్పుడు ఆ బాధలేదు. ఎందుకంటె జాతీయ రహదారులపై నిర్మించిన Read more

ఇజ్రాయెల్ – హెజ్‌బొల్లా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..
Israel Hezbollah 1

ఇజ్రాయెల్  రక్షణ బలగాలు గురువారం సౌత్ లెబనాన్‌లోని ఆరు ప్రాంతాలకు ట్యాంకు కాల్పులు జరిపాయి. ఇజ్రాయెల్  సైన్యం, హెజ్‌బోల్లాతో ఉన్న యుద్ధవిరామం ఉల్లంఘించబడినట్టు తెలిపింది. ఈ ఘటనలో, Read more

ట్రంప్ 2024: 27 ఏళ్ల కరోలిన్ లీవిట్ ను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమించారు
Karoline Leavitt

డొనాల్డ్ ట్రంప్ తన 2024 ఎన్నికల అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తన ప్రభుత్వంలో కీలకమైన పదవులలో కొత్త నియామకాలు చేస్తున్నారు. తాజాగా, ట్రంప్ 27 ఏళ్ల  కరోలిన్ లీవిట్ Read more

Astronauts : వ్యోమగాముల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
Astronauts

అంతరిక్షంలో వ్యోమగాములు అనారోగ్యానికి గురైతే, వారికి తగిన చికిత్స అందించేందుకు టీమ్‌లో ప్రత్యేకంగా ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఈ మెడికల్ ఆఫీసర్‌కు ప్రాథమిక చికిత్స, ఇంజెక్షన్లు Read more