ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.1,000 కోట్ల వ్యయంతో 2వేల కి.మీ మేర కొత్త రోడ్లను నిర్మించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. రహదారుల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మంచి అనుసంధానాన్ని కల్పించి, ఆర్థిక వ్యాపార కార్యకలాపాలకు తోడ్పాటుగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
పాత రోడ్ల మరమ్మతులకు అదనంగా రూ.500 కోట్లు
ఇప్పటికే ఉన్న పాత రహదారుల్లో దెబ్బతిన్నవాటిని మరమ్మతు చేయడానికి అదనంగా రూ.500 కోట్లు కేటాయించాలని సీఎం సూచించారు. రోడ్ల మరమ్మతులు వేగంగా, నాణ్యతతో జరగాలని, రానున్న వర్షాకాలానికి ముందే ప్రధాన మార్గాలను సిద్ధం చేయాలన్నారు. ప్రజలు ప్రయాణించడానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
పరస్పర జవాబుదారితనానికి ఆన్‌లైన్ ట్రాకింగ్ విధానం
నిర్మాణ పనుల్లో నాణ్యతను నిర్ధారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ‘‘ఏ రోడ్డు ఎవరు నిర్మించారు? ఎవరు మెయింటెన్ చేస్తున్నారు?’’ అన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆన్‌లైన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రజలే నేరుగా ఫిర్యాదులు పెట్టేలా టెక్నాలజీ వినియోగించాలని సూచించారు.
Read Also : Ice Cream : వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటున్నారా.. ఐతే ఇది మీ కోసమే..