Anticipatory bail granted to Perni Nani

పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు

అమరావతి: మాజీమంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. నానికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రేషన్‌ బియ్యం మిస్సింగ్‌ కేసులో ఏ6గా ఉన్నారు పేర్ని నాని. మచిలీపట్నం రేషన్‌ బియ్యం మిస్సింగ్‌ వ్యవహారంలో.. మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నంలోని గోదాముల్లో.. రేషన్‌ బియ్యం తగ్గినట్టు అధికారులు గుర్తించారు.

పేర్ని నానికి ముందస్తు బెయిల్

పేర్ని నాని కుటుంబ సభ్యులపై ఆరోపణలు

గోదాము మేనేజర్ మానస్ తేజ బ్యాంక్ ఖాతాలో.. రూ.1.18 కోట్ల నగదు లావాదేవీలను పోలీసులు గుర్తించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారని ఆరోపణలు వచ్చాయి. రేషన్ బియ్యం నిల్వలు, రవాణాలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు పేర్ని నాని కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

నాని పై తొందరపాటు చర్యలొద్దు

పేర్ని నాని ఆదేశాల మేరకే రేషన్ బియ్యం మాయం, లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి.. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా చేర్చారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండటానికి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. నాని పై తొందరపాటు చర్యలొద్దని, కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది.

Related Posts
నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు
Srivari Teppotsavam from today

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ(మార్చి 09) రాత్రి 07 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. 13వ తేది వరకు ప్రతిరోజూ రాత్రి 07 Read more

మతపరమైన పోస్టు: కాంగ్రెస్ ఎంపీపై కేసు
మతపరమైన పోస్టు కాంగ్రెస్ ఎంపీపై కేసు

గుజరాత్‌లోని జామ్నగర్‌లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గఢీపై, రెచ్చగొట్టే పాటతో ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ Read more

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి ఉత్తమ్ దిశా నిర్దేశం
Minister Uttam Kumar warning to party MLAs and MLCs

ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ Read more

మధుమేహం రోగుల సంఖ్యలో ముందరున్న భారతదేశం
Diabetes 1

మధుమేహం ముఖ్యంగా టైప్ 2 మధుమేహం, భారతదేశంలో ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. భారతదేశం ప్రపంచంలోనే మధుమేహం ఉన్న వ్యక్తుల సంఖ్యలో ముందరిగా ఉంది. ముఖ్యంగా, Read more