(Telangana ACB) అవినీతిపై ఏసీబీ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈసారి ముద్దుబాటయ్యిందో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్. మహబూబాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.టీజీఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్స్ విభాగంలో జనగాం నరేష్ (Jangaon Naresh) అనే అధికారి పనిచేస్తున్నారు. కురవి, మరిపెడ సబ్ డివిజన్లకు సంబంధించిన ఒప్పందాలను యధాతథంగా కొనసాగించేందుకు ఒక ఫిర్యాదుదారుని నుంచి రూ.1,00,000 లంచం కోరారు. ఇందులో భాగంగా ముందుగా రూ.20,000 తీసుకున్నారు.
ఏసీబీ వలలో అదుపులోకి
మిగిలిన రూ.80,000 Wednesday స్వీకరించేటప్పుడు ఏసీబీ అధికారులు నరేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సమాచారం అందిన వెంటనే చర్యలకు దిగిన అధికారులు నరేష్‌ను లంచం డబ్బుతో సహా అరెస్ట్ చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఏ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే మాకు తెలియజేయండి అని కోరారు. టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయొచ్చని తెలిపారు.
ఫిర్యాదుల కోసం మరిన్ని మార్గాలు
టోల్ ఫ్రీ నెంబర్‌తో పాటు వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@Telangana ACB), అధికారిక వెబ్‌సైట్ (https://acb.telangana.gov.in) ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.ఈ ఘటన రాష్ట్రంలో లంచం తీసుకునే అధికారులకు గుణపాఠంగా మారాలి. ఏసీబీ వంటి సంస్థలు అప్రమత్తంగా ఉంటే, అవినీతి పైకి రావడం కష్టం. ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేస్తే మాత్రమే ఈ వ్యవస్థ క్రమంలోకి వస్తుంది.
Read Also : Revanth Reddy : చంద్రబాబుకు ఒక సూచన చేస్తున్నా : రేవంత్ రెడ్డి