Another shooting in Chhattisgarh leaves several dead

Chhattisgarh : ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టుల మృతి!

Chhattisgarh : మరోసారి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాల్పులతో దద్దరిల్లుతోంది. గురువారం బీజాపుర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఇందులో భాగంగా జిల్లాల నుంచి సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

ఎదురు కాల్పులు పలువురు మావోయిస్టుల

మావోయిస్టులకు భారీ నష్టం

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. బీజాపుర్ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో బలగాలను పంపినట్లు ఎస్పీ జితేంద్రయాదవ్ వెల్లడించారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలడంతో సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు.

Related Posts
తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా
Priyanka Gandhi Vadra entered the Lok Sabha for the first time

న్యూఢిల్లీ: వయనాడ్‌ ఎంపీగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, Read more

మూసీ కూల్చివేతల్లో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే – ఈటెల
etela musi

తెలంగాణలో మూసీ కూల్చివేతల అంశంపై బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో ముందడుగు వేస్తామని ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో Read more

పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
telangana ips

తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు చేస్తూ కీలక మార్పులు చేసింది. ఈ బదిలీల ప్రకారం, గవర్నర్ యొక్క ఏడీసీగా శ్రీకాంత్ Read more

బస్సులో మహిళపై అత్యాచారం: నిందితుడి సమాచారం ఇస్తే రూ.1 లక్ష రివార్డు
MSRTC బస్సులో మహిళపై అత్యాచారం: నిందితుడి సమాచారం ఇస్తే రూ.1 లక్ష రివార్డు

మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్పందనను రేపింది. MSRTC బస్సులో ఒక యువతిపై అత్యాచారం చేసిన నిందితుడు దత్తాత్రే రాందాస్ గాడే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *