Another setback for Donald Trump

Donald Trump : డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

America : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా మిలిటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని ట్రంప్ నిషేధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిషేధంపై ఫెడరల్ న్యాయస్థానం నుంచి ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. సమానత్వ సూత్రాన్ని ఉదహరిస్తూ ట్రాన్స్‌జెండర్లపై నిషేధాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని ట్రంప్‌ నిషేధించారు. ఆ తర్వాత దేశ మిలిటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌ల నియామకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

ట్రాన్స్‌జెండర్‌ల హక్కులను అధ్యక్షుడు అడ్డుకోకూడదు

దీనిపై పలువురు ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించగా.. మంగళవారం విచారణ జరిగింది. రాజ్యాంగంలోని ట్రాన్స్‌జెండర్‌ల హక్కులను అధ్యక్షుడు అడ్డుకోకూడదు, ఆ అధికారం ఆయనకు ఉన్నా.. అది సమంజసం కాదని న్యాయమూర్తి అనారేస్ తెలిపారు. ఈసందర్భంగా సృష్టిలోని మానవులంతా సమానం అనే యూఎస్‌ స్వాతంత్ర్య ప్రకటనను గుర్తు చేస్తూ.. ట్రంప్‌ ఆర్డర్లను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల హక్కులపై రిపబ్లికన్ పార్టీ నేతలు తీవ్రమైన అభిప్రాయాలు వినిపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఒలింపిక్స్‌ వేదికగా అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్‌కు సంబంధించిన విషయంలో లింగ వివాదం నడిచిన సంగతి తెలిసిందే.

ఫెడరల్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు

కాగా, ప్రపంచ కుబేరుడు మస్క్‌ సారథ్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ కి ఫెడరల్‌ కోర్టులో చుక్కెదురైంది. యూఎస్‌ఎయిడ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల తొలగింపుపై ఫెడరల్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరగ్గా.. యూఎస్‌ ఎయిడ్‌ మూసివేతను వెంటనే నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇది పలు విధాలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని న్యాయమూర్తి థియోడర్‌ చువాంగ్ తెలిపారు.

Related Posts
రేపు కేంద్ర కేబినెట్ భేటీ..
Central cabinet meeting tomorrow

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు (బుధవారం) కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు జరుగనున్న ఈ కేంద్ర కేబినెట్ మీటింగులో పలు కీలక Read more

‘‘రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించడానికి ఉత్తమ సమయం ఇదే’’ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్
HDFC

భారతదేశంలోని ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, సకాలం లో పదవీ విరమణ ప్రణాళిక కోసం కీలకమైన ఆవశ్యకతపై దృష్టి సారించిన తన తాజా ప్రచార Read more

భోగి వేడుకల్లో కేటీఆర్‌, హరీశ్‌ రావు
KTR and Harish Rao in Bhogi celebrations

హైదరాబాద్‌: భోగి వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి సోమవారం తన నివాసంలో Read more

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన గురుకుల సిబ్బంది
Gurukula staff met Deputy Chief Minister Pawan Kalyan

అమరావతి : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *