అమెరికా అధ్యక్షా పదవి దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బందిని సెలవుపై వెళ్లిపోవాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. దీని వల్ల ప్రభుత్వంలో డైవర్సిటీ, సమానత్వం, చేర్చుకునే విధానాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. డైవర్సిటీ, ఈక్విటీ విధానాలపై తన తీవ్ర వైఖరిని మరోసారి స్పష్టంగా వెల్లడించారని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలోనూ ట్రంప్ వివిధ సమస్యలపై సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. జన్మత: పౌరసత్వం, WHO నుంచి అమెరికా వైదొలగడం, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలతో విమర్శలు ఎదుర్కొన్నా, తన విధానాలపై ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ కొత్త నిర్ణయం కూడా అదే ధోరణిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఫెడరల్ సిబ్బందిని సెలవుపై పంపడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న డైవర్సిటీ విధానాలు మరింత నెమ్మదించిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయం మానవ హక్కులు, సమానత్వం, చేర్చుకునే విధానాలపై తీవ్ర విమర్శలకు దారితీయొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.