flight missing

అమెరికా లో మరో విమానం అదృశ్యం.

అగ్రరాజ్యం లో వరుసగా విమాన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పది రోజుల క్రితమే మూడు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గురువారం రోజు సియోల్-టకోమా అంతర్జాతీయ విమానంలో రెండు విమానాలు ఢీకొట్టుకోగా.. ఎలాంటి ప్రాణ నష్టమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నేడు అమెరికాకు చెందిన మరో విమానం అదృశ్యమైంది. ముఖ్యంగా 9 మంది ప్రయాణికులు, ఒక పైలెట్‌తో వెళ్తున్న ఈ విమానం గాల్లో ఉండగానే అలస్కాలో గల్లంతు అయ్యింది.అమెరికాలోని బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందిన సెస్నా 208 బి గ్రాండ్ కారవాన్ మోడల్ విమానం శుక్రవారం రోజు అదృశ్యం అయింది.గురువారం రోజు సాయంత్ర 4 గంటలకు ఈ విమానం 9 మంది ప్రయాణికులు, ఒక పైలెట్‌తో ఉనల్కలేట్ నుంచి నోమ్‌కు వెళ్తోంది. మధ్యాహ్నం 2.37 గంటలకే ప్రయాణం ప్రారంభం కాగా.. 3.16 గంటలకు (మరో 28 నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకోబోతుందనగా) విమానం అదృశ్యం అయింది. విషయం గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా నార్టోన్ సౌండ్ ఏరియాలో ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

W445SWQ3KRCNJBUDF7YFJCCOZM

అక్కడకు సహాయక బృందాలను పంపించారు. ఈ విషయాన్ని ది అలస్కా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇప్పటికీ విమాన జాడ దొరకలేదని.. రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నట్లు వివరించింది. ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం కొండలు, గుట్టలు, అటవీ ఎక్కువగా ఉండడం వల్ల విమానాన్ని గుర్తించడం కష్టంగా మారిందని తెలుస్తోంది. రోడ్డు రవాణా కూడా సరిగ్గా లేకపోవడం వల్లే అక్కడి ప్రజలంతా ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తుంటారు. ఇక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని సమాచారం.విమానం అదృశ్యం అయిన విషయం తెలుసుకున్న అమెరికా ప్రజలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
అమెరికా న్యాయవాది బ్రియాన్ పీస్ రాజీనామా..
breon peace

అమెరికా న్యాయవాది బ్రియాన్ పీస్, అదానీ గ్రూపు మీద ఫ్రాడ్ (ఒప్పందాల మోసం) కేసులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు Read more

ఎలన్ మస్క్, ట్రంప్ కలిసి “గాడ్ బ్లెస్ అమెరికా” పాట పాడిన ప్రదర్శన వైరల్
musk

టెస్లా CEO ఎలన్ మస్క్ మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెన్వర్‌లోని మార్అ లాగో ఎస్టేట్‌లో “గాడ్ బ్లెస్ అమెరికా” పాటను కలిసి పాడిన Read more

భారత్‌పై నోరుపారేసుకున్న ట్రంప్
41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు ట్రంప్ సిద్ధం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవలే అమెరికాలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత అక్రమ వలసదారులు, రెండు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, Read more

కొనసాగుతున్న టెక్ ఉద్యోగుల తొలగింపు
tech employees

ప్రముఖ గ్లోబల్ CRM సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అయిన సేల్స్‌ఫోర్స్ భారీ తొలగింపు ప్లాన్స్ ప్రకటించింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇంకా గూగుల్ ఈ ఏడాది 2025లో ఉద్యోగుల తొలగింపులను Read more