Another plane crash in America.. Six dead?

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఆరుగురి మృతి?

ఫిలడెల్ఫియా: అమెరికాలో మరో విమాన ప్రమాదం సంభవించింది. ఇటీవల భారీ విమాన ప్రమాదం జరిగిన ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ఓ విమానం అకస్మాత్తుగా క్రాష్ అయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందినట్లు తెలుస్తుంది. అంతేకాక..పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో లీర్‌జెట్ 55 విమానం ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి మిస్సోరిలోని స్ప్రింగ్‌ఫీల్డ్-బ్రాసన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది.

Advertisements
image

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ చిన్న విమానం ఈశాన్య ఫిలడెల్ఫియాలో శుక్రవారం సాయంత్రం కుప్పకూలింది. భారీ పేలుడు సంభవించి అక్కడ పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం క్రాష్ అయిన చోట కొన్ని ఇళ్లు, వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. భారీ పేలుడుతో షాపింగ్ కాంప్లెక్స్, జనావాసాల మధ్య విమాన ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, ఎమర్జెన్సీ సెక్యూరిటీ, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు.

వ్యాపార జెట్‌లు, చార్టర్డ్ విమానాలకు సేవలందించే ఈశాన్య ఫిలడెల్ఫియా ఎయిర్ పోర్టు నుంచి కేవలం 4 కిలోమీటర్ల లోపే ఈ ప్రమాదం జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ చేసింది. క్రాష్ అయిన చోట సమీపంలోని ఇండ్లకు మంటలు అంటుకున్నాయి. విమాన ప్రమాదంతో అక్కడ షాపింగ్ మాల్స్ తాత్కాలికంగా క్లోజ్ చేశారని ఫిలడెల్ఫియాలోని అత్యవసర సేవల నిర్వహణ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6:06 గంటలకు ఎయిర్ పోర్ట్ నుంచి చిన్న జెట్ టేకాఫ్ అయింది. 1,600 అడుగుల ఎత్తుకు చేరుకోగా, కేవలం 30 సెకన్ల తర్వాత రాడార్ నుండి దాని సమాచారం లేదని విమాన డేటా చూపించింది.

కాగా, వాషింగ్టన్ సమీపంలో జనవరి 31న ఆర్మీ హెలికాఫ్టర్, ఓ విమానం ఢీకొన్న ప్రమాదంలో 64 మంది మృతిచెందారని తెలిసిందే. ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిగ్గా సమాచారం చేరవేసి, కమ్యూనికేట్ చేసి ఉంటే ప్రమాదం తప్పి ఉండేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts
Congress: రేపు ఢిల్లీకి కాంగ్రెస్ బీసీ నేతలు
Congress BC leaders to Delhi tomorrow

Congress: తెలంగాణ కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులకు Read more

గుకేశ్ కు ఎలాన్ మ‌స్క్ అభినంద‌న‌లు
gukesh d fide

భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ను ఎలాన్ మ‌స్క్ అభినంద‌న‌లు తెలిపారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విష‌యం తెలిసిందే. చైనాకు Read more

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
accident ADB

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. గుడిహత్నూర్ మండలంలో మేకలగండి దగ్గర జాతీయ రహదారి-44పై ప్రయాణిస్తున్న కారు Read more

ఈ కార్ రేస్ పై స్పందించిన మంత్రి పొంగులేటి
Minister strong warning to registration department employees

తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పులో ఏసీబీ దర్యాప్తులో Read more

×