CM Chandrababu visit to Annamayya district today

నేడు అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు..!

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లాకు రానున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంబేపల్లిలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఉదయం 11:10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.

image

మధ్యాహ్నం 12:05 గంటల కు కడప ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12:20 కి సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ చేరుకోనున్న సీఎం చంద్రబాబు… మధ్యాహ్నం 12:40 గంటలకు హెలిపాడ్ నుండి కాన్వాయ్ ద్వారా సంబేపల్లి కు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. మధ్యాహ్నం 12:50 గంటలకు సంబేపల్లిలోని దళిత మహిళ మంగమ్మ తోపాటు బీసీ వర్గానికి చెందిన గోర్ల వెంకటేష్ (వికలాంగుడు) ల ఇంటికి వెళ్లి వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును సీఎం చంద్రబాబు అందజేస్తారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. సంబేపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. పిఎన్ కాలనీ నుంచి హెలికాప్టర్ లో కడప ఎయిర్ పోర్ట్ కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. కడప నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్తారు.

Related Posts
గోరంట్ల‌ మాధ‌వ్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన వాసిరెడ్డి ప‌ద్మ
vasireddy padma

వైసీపీని వీడిన ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. తాజాగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. గోరంట్ల మాధవ్ అత్యాచార Read more

ఫిబ్రవరి 10 లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలి – సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రానున్న గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు Read more

మృతులకు పరిహారం ప్రకటించిన యూపీ ప్రభుత్వం
UP government has announced compensation for the deceased

ప్రయాగ్‌రాజ్‌: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మహాకుంభ్‌ డీఐజీ వైభవ్‌కృష్ణ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను డీఐజీ మీడియాకు వెల్లడించారు. అర్ధరాత్రి 1-2 Read more

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *