Another petition of Ram Gopal Varma in AP High Court

ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్ !

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని రామ్‌గోపాల్‌ వర్మ పిటిషన్ వేశారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జీవీ పిటిషన్ వేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు.

Advertisements

ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని రామ్‌గోపాల్‌ వర్మ పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ పిటిషన్ వేయడం జరిగింది. ఇక నేడు రామ్‌గోపాల్‌ వర్మ వేసిన పిటిషన్‌పై విచారించనున్న ఏపీ హైకోర్టు… ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి. అటు జైల్లో వేసినా కూడా తాను భయపడను అంటూ వర్మ కామెంట్స్ చేశారు.

కాగా, రామ్‌గోపాల్‌వర్మ(ఆర్జీవీ) అజ్ఞాతంలో ఉండి వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తనకు ఎలాంటి భయం లేదని చెబుతూ.. తనపై ఫిర్యాదు చేసిన వారికి ఏమాత్రం అర్హత లేదని ఆయన అందులో స్పష్టం చేశారు. పోలీసు విచారణకు సహకరిస్తానని చెప్పి.. తప్పించుకుని తిరుగుతున్న ఆయన వీడియోలో వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సోషల్‌ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో రెండుసార్లు ఆయన విచారణకు గైర్హాజరైన సంగతి తెలిసిందే.

Related Posts
ఫడ్నవీస్‌కు పాకిస్తాన్ నుంచి బెదిరింపు మెసేజ్
ఫడ్నవీస్‌కు పాకిస్తాన్ నుంచి బెదిరింపు మెసేజ్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హత్య బెదిరింపులు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బెదిరింపులు పాకిస్థాన్ ఫోన్ నంబర్ నుంచి వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. శుక్రవారం Read more

బెదిరించడం మీకే అలవాటు :నారా లోకేశ్‌
తల్లికి వందనంపై నారా లోకేష్ కీలక ప్రకటన

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు రెండో రోజు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా 19మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17 మందిని బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి Read more

రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదు – సీఎం రేవంత్
cm revanth ryathu sabha

రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా? అని మ‌హబూబ్ న‌గ‌ర్ రైతు Read more

Rain alert: మరో మూడు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
మరో మూడు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు కీలకంగా మారుతున్నాయి. వర్షాలు, ఎండలు రెండూ ఒకేసారి ప్రభావం చూపించబోతున్న నేపధ్యంలో ప్రజలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే Read more

×