Another key decision by the Telangana government.

Congress Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

Congress Govt: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజాలో నెల‌కొల్పిన నీరా కేఫ్‌ ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌ కు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌‌తో పాటు సహకరించిన ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌కు క‌ల్లుగీత విభాగం అధ్యక్షులు నాగ‌రాజు గౌడ్‌ ధ‌న్యవాదాలు తెలిపారు.

Advertisements

నీరాకేఫ్‌ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకు

నీరాకేఫ్‌ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకుఇదిలా ఉండగా.. ప్రభుత్వం ఎక్సైజ్‌, పర్యాటకశాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నీరా కేఫ్‌ను పర్యాటకశాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు బదిలీ చేసింది. ఆ భూమి టూరిజం శాఖది కావడంతో నీరాకేఫ్‌ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకు చెల్లించాలని పేర్కొంది. బీసీ సంక్షేమశాఖ, పర్యాటకశాఖ, రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

దాదాపు రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులు

కాగా, నీరా కేఫ్‌ను కేసీఆర్ ప్రభుత్వం దాదాపు రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈత మొద్దులు, తాటిమొద్దులపై కూర్చోడానికి వీలుగా సీట్లను డిజైన్‌ చేశారు. వాటిపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ నీరా తాగడానికి ఇక్కడికి జ‌నాలు వస్తుంటారు. ఇక్కడి ఫుడ్ స్టాల్‌లో తెలంగాణ వంటకాలను సైతం వడ్డిస్తారు. గీతకార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా ఈ నీరాకేఫ్‌ ఉంది. ఇతర పానీయాలతో పోల్చితే నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిద‌నేది వైద్య నిపుణుల చెబుతున్నారు.

Related Posts
వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల
Minister Payyavula introduced the annual budget in the assembly

బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు అమరావతి: ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ Read more

RRB: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే?
రైల్వే పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) తాజాగా లోకో పైలట్ CBT-2 పరీక్ష తేదీలను ప్రకటించింది. ఇదివరకు మార్చి 19వ తేదీన జరిగేలా షెడ్యూల్ చేసిన ఈ పరీక్షను Read more

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక..డీఏ 3 శాతం పెంపు
Diwali Gift. Central Govt Employees Likely To Get 3 DA Hike

న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు Read more

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్

ఫిబ్రవరి 27న పోలింగ్ ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగబోయే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ రణంగట్టిన ఉత్కంఠను పెంచాయి. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×