Another key decision by the Telangana government.

Congress Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

Congress Govt: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజాలో నెల‌కొల్పిన నీరా కేఫ్‌ ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌ కు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌‌తో పాటు సహకరించిన ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌కు క‌ల్లుగీత విభాగం అధ్యక్షులు నాగ‌రాజు గౌడ్‌ ధ‌న్యవాదాలు తెలిపారు.

Advertisements

నీరాకేఫ్‌ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకు

నీరాకేఫ్‌ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకుఇదిలా ఉండగా.. ప్రభుత్వం ఎక్సైజ్‌, పర్యాటకశాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నీరా కేఫ్‌ను పర్యాటకశాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు బదిలీ చేసింది. ఆ భూమి టూరిజం శాఖది కావడంతో నీరాకేఫ్‌ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకు చెల్లించాలని పేర్కొంది. బీసీ సంక్షేమశాఖ, పర్యాటకశాఖ, రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

దాదాపు రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులు

కాగా, నీరా కేఫ్‌ను కేసీఆర్ ప్రభుత్వం దాదాపు రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈత మొద్దులు, తాటిమొద్దులపై కూర్చోడానికి వీలుగా సీట్లను డిజైన్‌ చేశారు. వాటిపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ నీరా తాగడానికి ఇక్కడికి జ‌నాలు వస్తుంటారు. ఇక్కడి ఫుడ్ స్టాల్‌లో తెలంగాణ వంటకాలను సైతం వడ్డిస్తారు. గీతకార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా ఈ నీరాకేఫ్‌ ఉంది. ఇతర పానీయాలతో పోల్చితే నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిద‌నేది వైద్య నిపుణుల చెబుతున్నారు.

Related Posts
Modeling : యువతుల జీవితాలతో చెలగాటమడుతున్న దంపతులు
Modeling యువతుల జీవితాలతో చెలగాటమడుతున్న దంపతులు

Modeling : యువతుల జీవితాలతో చెలగాటమడుతున్న దంపతులు వినడానికి షాకింగ్‌గా అనిపించవచ్చు."మోడలింగ్ అవకాశం" అనే మాయాజాలంతో యువతులను ఉచ్చులో వేసి పోర్నోగ్రఫీ రాకెట్‌లోకి లాగిన ఘటన వెలుగుచూసింది.ఈ Read more

అభిమానులకు భోజనం ఏర్పాటు చేసిన రామ్ చరణ్
charan food

గేమ్ ఛేంజర్ విడుదల సందర్భంగా హీరో రామ్ చరణ్ అభిమానుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సినిమా విడుదల తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్‌లోని తన Read more

జాక్ పాట్.. అంటే ఈ లారీ డ్రైవేరేదేపో..!!
Truck driver wins Rs 10 cro

పంజాబ్‌లోని రూప్ నగర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ హర్పిందర్ సింగ్ కు అదృష్టం తలుపుతట్టింది. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర సంక్రాంతి బంపర్-2025 లాటరీలో Read more

వంజంగి మేఘాల కొండ,కొత్తపల్లి జలపాతం వద్ద కిక్కిరిసిన పర్యాటకులు
vanjangi

అల్లూరి జిల్లా లో పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకులతో ఆదివారం కిటకిటలాడాయి.ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన వంజoగి మేఘాల కొండను తిలకించేందుకు పర్యాటకులు తెల్లవారు జాము నుంచే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×