Diwali Gift. Central Govt Employees Likely To Get 3 DA Hike

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక..డీఏ 3 శాతం పెంపు

న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. డీఏ పెంపునకు సంబంధించి ఎప్పుడైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పేర్కొంది.

Advertisements

ఈరోజు ఉదయం ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు డీఏ పెంపుకు ఆమోదం తెలిపారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నిర్ణయంతో కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం సాధారణంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు ఉద్యోగుల డీఏను పెంచుతుంది.

పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను అందిస్తారు. ఈ ఏడాది మార్చిలో కూడా ఉద్యోగుల డీఏను, పెన్షనర్ల డీఆర్‌ను కేంద్రం 4 శాతం పెంచింది. పెంపుపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత… ఇప్పటి వరకు ఉన్న 50 శాతం డీఏ 53 శాతానికి చేరుకుంటుంది.

Related Posts
తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్
State Labor Minister Vasams

తిరుపతి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరుపతిలోని ఈ ఎస్ ఐ హాస్పిటల్ని అకస్మాతుగా శుక్రవారం తనిఖీ చేసారు. అదేవిధంగా హాస్పటల్ లో Read more

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు మద్రాసు హైకోర్టు ప్రశ్న
Madras High Court question to spiritual guru Jaggi Vasudev

Madras High Court question to spiritual guru Jaggi Vasudev న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా ఫౌండేషన్‌పై మద్రాసు హైకోర్టు సీరియస్ Read more

DK Shivakumar: కమీషన్‌ డిమాండ్‌ చేస్తే లోకాయుక్తకు ఫిర్యాదు చేయండి :శివకుమార్‌
DK Shivakumar: కమీషన్‌ డిమాండ్‌ చేస్తే లోకాయుక్తకు ఫిర్యాదు చేయండి :శివకుమార్‌

కర్నాటక  ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌,బిల్లులు చెల్లించేందుకు ఎవరైనా కమీషన్‌ డిమాండ్‌ చేస్తే లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు కమీషన్లు Read more

గాయంతో హీరోయిన్ రష్మిక..ఫొటోస్ వైరల్
rashmika gayam

జిమ్‌లో గాయపడిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక తన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె గాయపడిన నేపథ్యంలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. Read more

×