తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీలు సంచలనంగా మారాయి. దీంతో, తాజా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసారు. గీత దాటవద్దని ఏ సమస్య ఉన్నా తమ వద్దకు రావాలని సూచించారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్ కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవులు పీసీసీ కార్యవర్గం పై చర్చించనున్నారు.

రేవంత్ మంత్రాంగం తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో, ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశం కావాలని రేవంత్ నిర్ణయించారుఢిల్లీ వెళ్లిన రేవంత్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. బీసీ డిప్యూటీ సీఎం ఇదే సమయంలో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త నిర్ణయాల దిశగా కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పీసీసీ చీఫ్ పదవి బీసీ వర్గానికి ఇవ్వగా, తాజాగా డిప్యూటీ సీఎం పదవి సైతం బీసీ వర్గాలకు ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో భట్టి మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉండేలా హైకమాండ్ నిర్ణయించింది. బీజేపీ సైతం బీసీ సీఎం నినాదంతో ముందుకు వచ్చింది. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు సైతం బీసీకే ఇస్తారని సమాచారం దీంతో, బీసీ వర్గానికి చెందిన వారికి డిప్యూటీ సీఎంగా డిప్యూటీతో పాటుగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఈ క్రమంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి పైన తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే ముదిరాజ్ వర్గానికి కేటాయిస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు ఇక ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి కర నిర్ణయాలకు అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.