Another case registered against Vallabhaneni Vamsi

వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు

పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు

అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలు, దందాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత ఐదేళ్లూ మిన్నకుండిపోయిన బాధితులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కేసు పెట్టారు. గన్నవరం శివారు మర్లపాలెంలో సుమారు 18 ఎకరాల్లో పానకాల చెరువు ఉంది. ఆ చెరువులోని కొంత భాగాన్ని 15 మంది గ్రామస్థులు గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు.

Advertisements
వల్లభనేని వంశీపై మరో కేసు

అభివృద్ధి చేస్తామంటూ ఆ భూమిని స్వాధీనం

2023లో అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తన అనుచరులతో కలిసి భూములను ఖాళీ చేయాలని రైతులపై ఒత్తిడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ప్రజల ఉపయోగం కోసం చెరువును అభివృద్ధి చేస్తామంటూ ఆ భూమిని స్వాధీనం చేసుకొని.. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకున్నారు. చెరువు భూమికి ప్రత్యామ్నాయంగా రైతులకు వేరే చోట భూమి ఇస్తామని తొలుత చెప్పి.. తర్వాత దగా చేశారు. దీనిపై మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీకృష్ణ మంగళవారం రాత్రి గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏ1గా వల్లభనేని వంశీని, ఏ2గా అనగాని రవి, ఏ3గా రంగా, ఏ4గా శేషు, ఏ5గా మేచినేని బాబు పేర్లను చేర్చి కేసు నమోదు చేశారు.

Related Posts
‘తండేల్’ నుండి లవ్ సాంగ్ విడుదల
bujjithalli song

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న 'తండేల్' నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'బుజ్జి తల్లి' సాంగ్ ను ఈనెల Read more

జవాహర్ లాల్ నెహ్రూ: భారతదేశానికి శక్తివంతమైన నాయకత్వం ఇచ్చిన వ్యక్తి
jawaharlal nehru2

జవాహర్ లాల్ నెహ్రూ, భారతదేశం యొక్క తొలి ప్రధాని మరియు స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ స్వాతంత్ర్యానికి ఎన్నో త్యాగంచేసి, భారతదేశాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ దృష్టుల నుండి ఆధునిక Read more

Bomb Threat : మేడ్చల్‌ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు
Bomb threats to Medchal Collectorate

Bomb Threats : మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌కు ఈ రోజు బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. జిల్లా కలెక్టర్ గౌతం మెయిల్‌కు ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్టు Read more

బంగ్లాదేశ్‌లో హిందూ పూజారి అరెస్టు:హిందూ మతవర్గంపై భయాలు
hindu

భారతదేశం బంగ్లాదేశ్‌ కు తీవ్రమైన ఆందోళన ను వ్యక్తం చేసింది. అది చటోగ్రామ్ లో ఒక హిందూ పూజారిని అరెస్టు చేసిన ఘటనపై, ఇక్కడి ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను Read more

×