Another case against former minister Harish Rao

మాజీ మంత్రి హరీశ్ రావుపై మరో కేసు

కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌ : తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీసులు బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు సహా మరో ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని బాచుపల్లి పోలీసులను చక్రధర్‌ గౌడ్‌ ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సంతోష్‌ కుమార్‌, హరీష్ రావు, రాములు, వంశీలపై కేసు నమోదైంది.

మాజీ మంత్రి హరీశ్ రావుపై

ఏ2గా హరీష్ రావు

బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం హరీష్ రావు పై 351 (2) R/W 3, (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ -1 వంశీ కృష్ణ, ఏ3 సంతోష్ కుమార్, ఏ4గా పరుశురాములు పేర్లను చేర్చిన పోలీసులు ఏ2గా హరీష్ రావు పేరు చేర్చారు. గతంలో హరీష్ రావుపై ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేశారు చక్రధర్ గౌడ్. తన ఫోన్ ట్యాప్ చేసి తన భార్యతో, బంధువులతో జరిపిన ఫోన్ సంభాషణలను విన్నారని.. కోర్టు చర్యలు తీసుకోవాలని పోలీసులతో పాటు న్యాయస్థానాన్ని సైతం చక్రధర్ గౌడ్ ఆశ్రయించడం తెలిపిందే. తాజాగా హరీష్ రావు సహా కొందరి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

జూన్‌ 19న చక్రధర్‌గౌడ్‌ డీజీపీకి ఫిర్యాదు

కాగా, మాజీ మంత్రి హరీష్‌రావు తన ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్‌లను ట్యాప్‌ చేయించాడని సిద్దిపేట కాంగ్రెస్‌ నేత చక్రధర్‌గౌడ్‌ ఆరోపించారు. తన ఫోన్‌ ట్యాప్‌ అయిందంటూ గత ఏడాది జూన్‌ 19న చక్రధర్‌గౌడ్‌ డీజీపీకి ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు చక్రధర్‌గౌడ్‌ను గతంలో విచారించిన పోలీసులు సరైన ఆధారాలు తీసుకు రావాలని సూచించారు.

Related Posts
ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం : బైక్ ర్యాలీని నిర్వహించిన అపోలో క్యాన్సర్ సెంటర్
Prostate Cancer Awareness P

హైదరాబాద్ : అపోలో క్యాన్సర్ సెంటర్ (ACC) హైదరాబాద్, ది బైకెర్నీ క్లబ్‌తో కలిసి, ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పురుషుల క్యాన్సర్ మాసం సందర్భంగా Read more

సిద్దరామయ్యకు స్వల్ప ఊరట
relief for Siddaramaiah

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ముడా స్కామ్ కేసులో కొంత ఊరట లభించింది. ఈ కేసును లోకాయుక్త నుండి సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. Read more

భారీ బందోబస్తు నడుమ ఢిల్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
EC is conducting the Delhi elections amid heavy preparations

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు భారీ భద్రత నడుమ పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుందని ఈసీ పేర్కొంది. మొత్తం 70 Read more

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్
Pawan announced a donation

తలసేమియా బాధితుల కోసం పవన్ సాయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.50 లక్షల విరాళాన్ని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *