Another body found in SLBC tunnel!

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం!

SLBC Tunnel: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామ సమీపంలోని ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన ఏడు మంది కోసం జరుగుతున్న సహాయక చర్యల్లో 32వ రోజున మరో మృతదేహం లభించడంతో పురోగతి కనిపిస్తున్నది. మినీ హిటాచితో మట్టి ఇతర శఖలాలు తొలగిస్తున్న క్రమంలో కన్వేయర్‌ బెల్ట్‌కు సుమారు 50 మీటర్ల దూరంలో మృతదేహం కనిపించినట్లు తెలుస్తుంది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం

మరో ఆరుగురి కోసం సొరంగంలో తవ్వకాలు

ఆ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా గడచిన 32 రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో సుమారు 700 మంది ఆపరేషన్ నిర్వహిస్తూ వారికోసం కొనసాగిస్తున్న అన్వేషణ ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యంకాగా..మరో ఆరుగురి కోసం సొరంగంలో తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయంపై ఆ మృతదేహం ఎవరిది అనేది గుర్తించి అధికారుల నిర్ధారిస్తూ ప్రకటన చేయాల్సి ఉంది.

మరో మృతదేహం గుర్తింపు

కాగా, శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కూలిపోయి నెల రోజులకు పైగా గడిచినా కార్మికులలో ఏడుగురి మృతదేహాలను వెలికితీయడానికి సహాయకులు కష్టపడుతున్నారు. ఫిబ్రవరి 22న 14 కిలోమీటర్ల సొరంగంలో ఒక భాగం కూలిపోయిన విషయం తెలిసిందే. 50 మంది కార్మికులు సొరంగం నుండి బయటకు రాగలిగారు.. సొరంగం పైకప్పు కూలిపోయిన తర్వాత ఎనిమిది మంది లోపల చిక్కుకుపోయారు. ఇప్పటివరకు, ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. ఇప్పుడు మరో మృతదేహాన్ని రెస్క్యూ టీమ్‌ గుర్తించింది.

Related Posts
వలసదారులను భారీగా తగ్గించనున్న ట్రూడో ప్రభుత్వం
Trudeau government will drastically reduce immigration

ఒట్టావా : రానున్న ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ట్రూడో ప్రభుత్వానికి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వలసదారుల ప్రవేశాన్ని అనూహ్యంగా తగ్గించేందుకు Read more

సంగారెడ్డిలో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌
drugs3

డ్రగ్స్ కంట్రోల్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. తాజాగా సంగారెడ్డిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. న్యూ ఇయర్ దగ్గ Read more

ఏపీకి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం కేవలం పవన్ కే ఉంది – విజయసాయి రెడ్డి
vijayasai cbn

వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశిస్తూ.. 75 ఏళ్ల వృద్ధుడు ఆంధ్రప్రదేశ్‌కు Read more

WPL 2025 పూర్తి షెడ్యూల్
WPL 2025 పూర్తి షెడ్యూల్

మహిళల ప్రీమియర్ లీగ్ యొక్క మూడవ ఎడిషన్ ఫిబ్రవరి 14 న ప్రారంభమవుతుంది మరియు మొదటి WPL నాలుగు నగరాల్లో-బరోడా, బెంగళూరు, ముంబై మరియు లక్నోలో ఆడబడుతుంది, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *