Announcement by chairman of 38 market committees in AP

AP : ఏపీలో 38 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

AP: ఏపీలో నామినేటెడ్‌ పదవుల భర్తీ కొనసాగుతోంది. తాజాగా 38 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించింది. వాటిలో 31 టీడీపీ, 6 జనసేన, 1 బీజేపీ నేతలకు అవకాశం ఇచ్చారు. మిగిలిన మార్కెట్‌ కమిటీలకు త్వరలోనే ఛైర్మన్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. వాటిల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీకు కేటాయించారు.

Advertisements
ఏపీలో 38 మార్కెట్‌ కమిటీలకు

టీడీపీ నుంచి తుని ఏఎంసీ చైర్మన్ గా

టీడీపీ నుంచి తుని ఏఎంసీ చైర్మన్ గా అంకంరెడ్డి రమేశ్, రాప్తాడులో సుధాకర్ చౌదరి, ప్రత్తిపాడులో బడ్డి మణి, గుడివాడలో ఛాత్రగడ్డ రవి కుమార్, పుత్తూరులో డీఎస్ గణేష్, దర్శిలో దారం నాగవేణి, పాయకరావుపేటలో దేవర సత్యనారాయణ, గన్నవరంలో గరికపాటి శివశంకర్, వేమూరులో గొట్టిపాటి జయవెంకట పూర్ణకుమారి, పర్చూరులో గుంజి వెంకట్రావు, ఈపూరులో జరపల రాములుబాయి, విజయనగరంలో కర్రోతు వెంకట నర్సింగరావు, పాలకొల్లులో కోడి విజయభాస్కర్, చీరాలలో కౌతారపు జనార్ధన్ రావు, మద్దిపాడులో మన్నం రాజేశ్వరి, రేపల్లెలో మత్తి అనురాధకు అవకాశం ఇచ్చారు.

జేపీ తరపున యర్రగుంట్లలో రామిరెడ్డిపల్లి నాగరాజు

అలాగే వినుకొండలో మీసాల మురళీకృష్ణ, రొంపిచర్లలో మొండితోక రాణి, పెద్దాపురంలో నూనే మంగలక్ష్మి, కూచినపూడిలో ఓగిబోయిన వెంకటేశ్వరరావు, గజపతినగరంలో పీవీవీ గోపాల రాజు, నరసన్నపేటలో పగోటి ఉమా మహేశ్వరి, కంభంలో పూనూరు భూపాల్ రెడ్డి, తిరువూరులో రేగళ్ల లక్ష్మీ అనిత, కమలాపురంలో సింగిరెడ్డి రాఘవరెడ్డి, జలుమూరులో తర్రా బలరాం, సంతమాగూలూరులో తేలప్రోలు రమేశ్, రాయదుర్గంలో ఉండాల హనుమంతరెడ్డి, దుగ్గిరాలలో ఉన్నం ఝాన్సీరాణి, నందికొట్కూరులో వీరం ప్రసాదరెడ్డి, గోపాలపురంలో యద్దనపూడి బ్రహ్మరాజు, కనిగిరిలో యరవ రమాదేవికి ఛాన్స్ దక్కింది. జనసేన తరఫున రాజాంలో పొగిరి కృష్ణవేణి, భీమిలిలో కురిమిని రామస్వామి నాయుడు, అలమూరులో కొత్తపల్లి వెంకటలక్ష్మి, పెడనలో భీముని అనంతలక్ష్మి, ఉండిలో జుత్తుగ నాగరాజుకు అవకాశం ఇచ్చారు. అలాగే బీజేపీ తరపున యర్రగుంట్లలో రామిరెడ్డిపల్లి నాగరాజుకు ఏఎంసీ ఛైర్మన్ గా ఛాన్స్ ఇచ్చారు.

Related Posts
యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలకు సీఎం కీలక ఆదేశాలు
CM Revanth Reddy to Youth Congress and NSUI leaders

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి హైదరాబాద్‌: గ్యాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సి వ్యూహాలపై శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ Read more

నేడే హరియాణా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
haryana jammu kashmir elect

హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం Read more

తిరుపతి తొక్కిసలాట మృతుల పిల్లలకు ఉచిత విద్య
తిరుపతి తొక్కిసలాట మృతుల పిల్లలకు ఉచిత విద్య

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనలో మరణించిన భక్తుల పిల్లలకు తమ సంస్థల Read more

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా..
Tirupati Deputy Mayor Election Postponed

అమరావతి: తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగాలి. అందుకు ఎస్వీయూ సెనేట్‌ హాలులో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×