
అన్నా లెజినోవా సంప్రదాయ దుస్తుల్లో తిరుమల దర్శనం
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి Anna lezhinova తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ, టిటిడి ఆలయ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చీర ధరించి సంప్రదాయ హిందూ ఆడపడుచులా ఆమె సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయంలో ఆద్యంతం ఆమె భక్తి భావంతో గడిపారు. స్వామివారికి కానుకలు సమర్పించగా, రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న లెజినోవా
ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ స్వల్ప గాయాల నుంచి కోలుకున్న తర్వాత, ఆపదమొక్కుల వెంకన్నకు మొక్కులు తీర్చేందుకు Anna lezhinova తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం రాత్రి నీలాలు సమర్పించి, వరాహస్వామిని దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆమె 17 లక్షల రూపాయల విరాళాన్ని టిటిడి అధికారులకు అందజేసి, భక్తులకు అన్నదానం నిర్వహించారు. స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించి, తానే అన్నప్రసాదం స్వీకరించారు. అన్నప్రసాదాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.
పవన్ అభిమానుల సందడి – భక్తుల మనసులు గెలుచుకున్న లెజినోవా
ఈ సందర్భంగా ఆమెను టిటిడి అదనపు ఈఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలసి పలకరించారు. తిరుమలలో ఆమె సంప్రదాయ దుస్తులు ధరించి, సంపూర్ణ భక్తితో ఆలయ దర్శనం నిర్వహించారు. శ్రీవారి చిత్రపటానికి హారతి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టారు. పరామర్శించాలని పవన్ కల్యాణ్ అభిమానులు, కూటమి నాయకులు తిరుమలలో జమయ్యారు. మధ్యాహ్నం Anna lezhinova తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు ప్రయాణించారు. కుమారుడి ఆరోగ్య కోలుకై శ్రీవారికి మొక్కు తీర్చిన ఆమె భక్తి, వినయంతో ఆదర్శంగా నిలిచారు.
Read more : Bhumana Karunakar Reddy: మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన భూమన