ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ‘హుకుం వరల్డ్ టూర్’ లో భాగంగా జూలై 26న చెన్నైలో జరగాల్సిన ‘హుకుం చెన్నై’ (‘Hukum Chennai’) కాన్సర్ట్ వాయిదా పడింది. ఈ వార్తను ఆదివారం ఆయన అధికారికంగా వెల్లడించారు.అనిరుధ్ మాట్లాడుతూ, టికెట్లకు ఆశించిన దాని కంటే చాలా ఎక్కువ స్పందన వచ్చింది. అభిమానుల నుంచి వస్తున్న ప్రేమను చూసి ఆశ్చర్యపోయాను, అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాన్సర్ట్ వేదిక అయిన తిరువిదంతై ప్రాంతంలో స్థలం పరిమితంగా ఉండటంతో, అందరికీ సీట్‌లను కేటాయించడం సాధ్యపడటం లేదని పేర్కొన్నారు.అనిరుధ్ తెలిపారు, ఇన్ని మందిని ఒకేచోట ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీ అందరి సహనానికి ధన్యవాదాలు. త్వరలోనే మరింత పెద్ద వేదికతో మళ్ళీ వస్తాం. ఆయన ఈ మాటలతో అభిమానుల మన్ననలు పొందుతున్నారు.

కొనుగోలు చేసిన టిక్కెట్లకు రీఫండ్ లభ్యం
ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి 7 నుండి 10 రోజుల్లో డబ్బు తిరిగి జమ చేస్తామని అనిరుధ్ వెల్లడించారు. అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఆయన తెలిపారు.ఈ కాన్సర్ట్‌ను మరో సమయానికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్న అనిరుధ్, కొత్త తేదీ మరియు వేదికను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అభిమానులు కొంచెం ఓపిక పట్టాలని, ఈసారి మరింత భారీ స్థాయిలో కాన్సర్ట్ ఉండబోతోందని హామీ ఇచ్చారు.
అభిమానుల కోసం గ్రాండ్ రీ ఎంట్రీ
అనిరుధ్ స్టేజ్‌పైకి అడుగుపెడతాడంటే అది సెలబ్రేషన్ లాంటి రోజు. అభిమానులకు ఈ నిరాశ తాత్కాలికమే. కానీ రాబోయే ‘హుకుం చెన్నై’ కాన్సర్ట్, ఇప్పటి వరకు చూసినవాటికన్నా ప్రత్యేకంగా ఉండబోతోంది.అనిరుధ్ రాక కోసం వేచి చూసే అభిమానులకు – ఇది కేవలం స్టార్ట్ మాత్రమే!
Read Also : Rajamouli: ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ‘F1’ సినిమా చూసిన రాజమౌళి