రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన అనిల్ అంబానీ (Anil Ambani) , ఈడీ కార్యాలయంలో విచారణను ఎదుర్కొననున్నారు. సుమారు రూ. 17 వేల కోట్ల రుణాల మోసానికి సంబంధించిన కేసులో ఆయనను ఈడీ ప్రశ్నించనుంది.

ఈడీ దాడులు, సమన్లు
గత వారం, ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ముంబైలో 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడులు రిలయన్స్ గ్రూప్ (Reliance Group) కు చెందిన 50 కంపెనీలు, 25 మంది వ్యక్తుల కార్యాలయాలు, నివాసాలపై జరిగాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఈ రుణ మోసం కేసులో అనిల్ అంబానీ (Anil Ambani) ప్రధానంగా విచారణను ఎదుర్కొంటున్నారు. యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాల మళ్లింపు, వాటిని తిరిగి చెల్లించకపోవడం వంటి ఆరోపణలపై ఈడీ దృష్టి సారించింది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: