గ్లోబల్ ఐకాన్ ఏంజెలీనా జోలీ (Angelina Jolie) ఇప్పుడు జీవితంలో కొత్త దశకు అడుగుపెడుతున్నారు. బ్రాడ్ పిట్‌తో విడాకులు పూర్తయిన తర్వాత, ఆమె అమెరికా (America) ను వీడి విదేశాల్లో కొత్త Chapter ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.ఇన్నాళ్లు లాస్ ఏంజిల్స్‌లో ఉండటం పూర్తిగా పిల్లల కోసమేనని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇకపోతే అక్కడ నివసించే అవసరం లేదని జోలీ స్పష్టంగా భావిస్తున్నారు.జోలీ గతంలోనే చెప్పారు – బ్రాడ్ పిట్‌తో కస్టడీ ఒప్పందం కారణంగానే లాస్ ఏంజిల్స్‌లో ఉండాల్సి వచ్చిందని. లేకపోతే, ఆ నగరంలో స్థిరపడాలనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని వెల్లడించారు.ప్రపంచంలో నేను చూసిన మానవత్వం, ప్రశాంతత లాస్ ఏంజిల్స్‌లో లేదు.విడాకుల వల్లనే ఆ నగరంలో గడిపిన కాలం అని ఆమె గుర్తు చేసుకున్నారు.

కవలలు పెద్దవాళ్లు అయ్యాకే ఆ ప్లాన్
జోలీ, పిట్ దంపతులకు మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో కవలలు నాక్స్, వివియన్‌లకు త్వరలోనే 18 ఏళ్లు నిండనుండటంతో, జోలీ త్వరలోనే విదేశాలకు తరలివెళ్లే ఆలోచనలో ఉన్నారు.అంతేకాక, 2017లో కొనుగోలు చేసిన చారిత్రాత్మక సిసిల్ బి. డిమిల్లీ ఎస్టేట్‌ను అమ్మకానికి పెట్టాలనుకుంటున్నారట. దీన్ని ఆమె దాదాపు 24.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.జోలీ విదేశాల్లో ఎక్కడ స్థిరపడాలనే విషయంలో ప్రస్తుతం పలు దేశాలను పరిశీలిస్తున్నారు. అయితే, ఆమెకు కంబోడియా పట్ల ఉన్న ప్రత్యేక అనుబంధం చూస్తే, అక్కడే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.తన దత్త కుమారుడు మాడాక్స్ సొంతదేశం కంబోడియా కావడం, అలాగే జోలీ అక్కడ చాలా సమయం గడపడం వల్ల ఆ దేశం ఆమెకు హృదయానికి దగ్గరగా మారింది.
గతం నుంచి వర్తమానం – జోలీ జీవితం
‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ సినిమా సెట్‌లో జోలీ, పిట్ ప్రేమలో పడ్డారు. 2014లో వివాహం చేసుకున్నారు. కానీ, 2016లో విడిపోయారు.అప్పటి నుంచి పిల్లల కస్టడీ, ఆస్తుల పంపకాలపై వారిద్దరూ న్యాయపరంగా ఎదురుదెబ్బలు తిన్నారు.ఆ పోరాటం ఇప్పటికి ముగిసినందుకు, జోలీకి స్వేచ్ఛ దక్కింది. ఇక తన జీవితాన్ని ఆమె కోరిన విధంగా మలుచుకునే సమయం వచ్చింది.వైదేశిక ప్రణాళికల మధ్య, జోలీ కెరీర్‌పైనా దృష్టిపెట్టారు. త్వరలోనే ఆమె ‘ది ఇనిషియేటివ్’ అనే స్పై థ్రిల్లర్‌లో నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో మరోసారి ఆమె హాలీవుడ్‌లో తన స్థాయిని ప్రూవ్ చేయబోతున్నారు.ఏంజెలీనా జోలీ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కుటుంబం కోసం త్యాగాలు చేసిన ఆమె, ఇప్పుడు తన కలల్ని నిజం చేసుకోవాలనుకుంటోంది. జీవితాన్ని కొత్త కోణంలో చూస్తూ, మరోసారి ముందుకు అడుగులేస్తోంది.
Read Also :