हिन्दी | Epaper
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్

వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Sudheer
వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో నిర్మాణం ద్వారా నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంతో పాటు, ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొదటి దశలో కీలక కారిడార్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చారు.

వైజాగ్ మెట్రో ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. కారిడార్ 1లో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్ల లైన్ నిర్మించనున్నారు. కారిడార్ 2లో గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08 కిలోమీటర్లు, కారిడార్ 3లో తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మెట్రో లైన్ వేయనున్నారు.

రెండో దశలో మెట్రో నిర్మాణాన్ని విస్తరించి, కారిడార్ 4గా కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 30.67 కిలోమీటర్ల లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వలన వైజాగ్ నగరానికి పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది. అలాగే విజయవాడలో మెట్రో ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి దశలో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు కారిడార్ 1ను నిర్మిస్తారు. కారిడార్ 2లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు మెట్రో లైన్ వేయనున్నారు.

రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మెట్రో లైన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి, నగరాల అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870