हिन्दी | Epaper

బిల్డింగ్ పై నుండి దూకి ప్రేమజంట ఆత్మహత్య

Sudheer
బిల్డింగ్ పై నుండి దూకి ప్రేమజంట ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కిరెడ్డిపాలెంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత కుటుంబాలు బతుకుదెరువు కోసం విశాఖపట్నానికి వలస వచ్చి షీలానగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాయి. సుష్మిత, దుర్గారావు మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురు కలిసి జీవితం గడపాలని నిర్ణయించుకున్నప్పటికీ, వారి ఇళ్లలో పెళ్లి విషయంపై ప్రస్తావన తీసుకురాగా కుటుంబాల నుంచి నిరాకరణ ఎదురైంది. ఈ నిరాకరణ వారిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.

ఈ క్రమంలో వారిద్దరూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కలిసి జీవించే అవకాశం లేదని..కలిసి చనిపోదామని చెప్పి ఓ అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కిరెడ్డిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు కుటుంబ సభ్యుల మధ్య ఉత్పన్నమైన ఒత్తిళ్లు కారణమా లేదా ఇతర కారణాలా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

📢 For Advertisement Booking: 98481 12870