కడప : ఉమ్మడి కడప జిల్లాలో జరగనున్న జడ్పిటిసి ఎన్నికలు (ZPTC Elections) తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత శాసనసభ ఎన్నికల తరువాత మొదటిసారి జరిగే ఈ ఉప ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒంటిమిట్ట జడ్పిటిసిగా ఉన్న ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తన జడ్పిటిసి స్థానానాకి రాజీమానా చేయగా, పులివెందుల జడ్పిటిసిగా ఉన్న తుమ్మల మహేశ్వర్రెడ్డి ఒక ఉత్సవంలో జరిగిన ప్రమాదంలో మరనించడంతో ఈ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాగైనా ఈ రెండింటిని దక్కించుకోవాలని రెండు పార్టీలు (Both parties) వ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. పులివెందుల మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత మండలం కావడంతో ఎలాగైనా తమ అభ్యర్థిని గెలుపించుకోవాలని వైకాపా నేతలు పావులు కదువుతున్నారు. పులివెందుల రూరల్ పరిధిలో ఆర్ తుమ్మలపల్లి, రాయలాపురం, రచ్చుమర్రి పల్లి, అచ్చవెల్లి, ఎర్రిపల్లి, క్మనపల్లి, యర్రబల్లి, నల్లపురెడ్డిపల్లి, ఈ. కొత్తపల్లి తదితర 9 గ్రామపంచాయ తీలకు సంబంధించి 10601 ఓట్లు కలిగి ఉన్నాయి.
గత ఎన్నికల్లో ఈ జెడ్పిటిసి స్థానం వైకాపా ఏకగ్రీవంగా తుమ్మల మహేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు.. 2022 మార్చి 19వ తేదీన ఆరు తుమ్మలపల్లి గ్రామ సమీపంలోని గంగమ్మ జాతర నందు సిరిబండి నడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి జడ్పిటిసి మహేశ్వర్రెడ్డిమృతి చెందాడు. దీనితో జడ్పిటిస్థానం ఖాళీ అయింది. ఇక ఒక ఏడాది మాత్రమే సమయం ముగుస్తుంది అనగా అనూహ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ జెడ్పిటిసి స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనితో వైఎస్సార్సీ తరపున తుమ్మల మహేశ్వర్ రెడ్డి కుమారుడు. తుమ్మల హేమంత్ రెడ్డిని బరిలో దింపింది. కూటమి తరఫున నియోజకవర్గ ఇన్చార్ట్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలో దించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ రెడ్డిని బరిలో దించగా ఇండిపెండెంట్ లో కలిసి మొత్తం 11 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఈ చిన్న ఎన్నికైన పులివెందుల జడ్పీటీసీ స్థానం వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖకావడంతో మళ్లీ తిరిగి వైఎస్సార్సీ దక్కించుకోవాలని వారు ప్రయత్నిస్తుండగా ఎలాగైనా ఈ సారి టిడిపి పాగా వేసి సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీలు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలను ఎత్తుకు పై ఎత్తులను ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైఎస్సార్సీ నుంచి ప్రతి గ్రామంలో కూడా టిడిపి వైపు చేర్చుకోవడంలో తెదేపా నాయకులు ప్రయత్నిస్తుంటే పట్టు విడవకుండా తమ సత్తాను నిలుపుకోవాలని వైకాపా ప్రయత్నిస్తోంది. ఒంటిమిట్ట మండలంలో జడ్పీటీసీ స్థానంలో గత 30 ఏళ్లుగా కాంగ్రెస్, వైఎస్సార్సీ అభ్యర్థుల గెలుపుతున్నారు. 1995లో చివరగా జెడ్పిటిసిగా నరసింహులు గెలుపొందారు. ఆ తర్వాత ఇప్పటివరకు టిడిపి అభ్యర్థులు గెలవలేదు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్ బ్యాంకు బలంగా ఉండడంతో పాటు ఎస్సీ సామాజిక వర్గం కూడా ఆ పార్టీకి వెన్ను దన్నుగా ఉంటూ వచ్చింది. అయితే ఓట్ బ్యాంక్ పరంగా గెలుపొందినా భారీ ఆధిక్యతలు పెద్దగా నమోదు కాలేదు. మొదటిసారిగా రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులే అటు వైసిపి టిడిపి తరఫున పోటీ చేస్తున్నడంతో రసవత్తరంగా మారింది. మరోవైపు టిడిపికి బలిజ, చేనేత కార్మికులు, బీసీలు అండగానిలుస్తున్నారు.

13 గ్రామ పంచాయతీలు, 24,606 ఓట్లు ఉన్న ఈ మండలంలో ఈ దఫా వైఎస్సార్సీ అభ్యర్థిగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఇరగం రెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మంటపంపల్లె గ్రామపంచాయతీ నుండి పోటీలో నిలిచిన టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు కావడం ఈ దఫా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సామాజికములు చీలికను బట్టి అభ్యర్థుల విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. వైసీపీ పార్టీ అభ్యర్థి మొదట ఖరారు కావడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ రెడ్డి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయనతోపాటు రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ కుమార్ రెడ్డిలు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం రెండు పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు. మంత్రి రాకతో పార్టీలో జోష్ పెరిగింది. ఈయనతోపాటు ఆ ప్రాంతానికి చెందిన టిటిపి నాయకులు గెలుపు కోసం శ్రమిస్తున్నారు. నేటి నుంచి రాష్ట్ర మంత్రులు జనార్దన్ రెడ్డి, సవిత కూడా ప్రచారంలోకి దిగనున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ జయ ప్రకాష్, పార్టీ పరిశీలకుడు చిట్టిబాబు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి అభ్యర్థి తరపున బిజెపి జనసేన, టిడిపి నేతలకు పంచాయతీల వారీగా బాధ్యతలు అప్పగించి మండలంలో మోహరించనున్నారు. అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి ఒంటిమిట్టలో గెలుపు ప్రతిష్టగా మారింది. మరోవైపు పట్టు కోసం వైసిపి సర్వసక్తులు ఒడ్డి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో జడ్పిటిసి ఎన్నికలు హొరాహొరీగా మారాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :