నేడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (jagan) పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ పరమైన విభేదాల కారణంగా దూరమైన సోదరి వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
Read also: EO Srinivasa Rao: శ్రీశైలం ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

YSRCP
అగ్రనేతలు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
డిసెంబర్ 21న పుట్టినరోజు జరుపుకుంటున్న జగన్‌కు వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, విజయసాయిరెడ్డి వంటి నేతలు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు. రాజకీయ భేదాలకంటే కుటుంబ బంధాలు గొప్పవనే సందేశాన్ని షర్మిల శుభాకాంక్షలు ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: