हिन्दी | Epaper

YS Sharmila: కరేడు భూముల విషయంలో సహించేది లేదు: షర్మిల ఆగ్రహం

Sharanya
YS Sharmila: కరేడు భూముల విషయంలో సహించేది లేదు: షర్మిల ఆగ్రహం

ఇండోసోల్ కంపెనీ సోలార్ ప్లాంట్ కోసం నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో భూ సేకరణ (land acquisition) పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను గతంలోనే చెప్పినట్టు రైతుల పక్షాన పోరాటం చేస్తామని మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు. పచ్చటి పొలాలు, మూడు పంటలు పండే భూములు పరిశ్రమల పేరిట కబ్జా చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

YS Sharmila: కరేడు భూముల విషయంలో సహించేది లేదు: షర్మిల ఆగ్రహం
YS Sharmila: కరేడు భూముల విషయంలో సహించేది లేదు: షర్మిల ఆగ్రహం

గ్రామ ప్రజల జీవనాధారమే భూములు

కరేడు గ్రామంలోని పెద్ద శాతం రైతుల జీవనాధారం వ్యవసాయమే. “కరేడు రైతులది బతుకు పోరాటం. ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు. కరేడు భూములు జోలికొస్తే రైతుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. పచ్చటి పొలాల్లో ప్రజా అభిప్రాయం సేకరించకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గం. ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండోసోల్ సోలార్ కంపెనీ (Indosol Solar Company)కి 8,458 ఎకరాలు దారాదత్తం చేస్తామనడం ద్రోహం.

వైసీపీ తప్పు – కూటమి ప్రభుత్వం మరింత మోసం-

గత వైసీపీ ప్రభుత్వం ఈ కంపెనీకి అనుమతులు ఇస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏకంగా ఊరినే ఖాళీ చేయించేలా భూములు కేటాయించాలని చూడటం అన్యాయమని పేర్కొన్నారు. ఈ మేరకు కరేడు రైతులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం షిరిడీ సాయి అనుబంధ కంపెనీకి అనుమతులు ఇస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం భూ సేకరణకు కనీసం గ్రామ సభలు పెట్టలేదు. మూడు పంటలు పండే పచ్చటి పొలాల్లో పరిశ్రమ వద్దంటున్న రైతుల గోడు వినలేదు. ఇండోసోల్ కంపెనీకి అదనంగా భూములు కేటాయించి, ఊరినే ఖాళీ చేయించాలని చూస్తున్నారు. శాంతియుత ఉద్యమం చేసే కరేడు గ్రామ ప్రజలను నిర్బంధించడాన్ని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.

కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సన్నద్ధం

ఈ భూ సేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, “ఇది కేవలం భూముల కోసం పోరాటం కాదు ఇది జీవనోపాధికి సంబంధించిన శాస్త్రోక్తమైన పోరాటం” అని షర్మిల (YS Sharmila) స్పష్టం చేశారు. రైతుల పక్షాన తామూ ఉద్యమంలో పాల్గొంటామని, ప్రభుత్వం మెత్తపడ్డా, కఠినంగా ఉన్నా వెనక్కి తగ్గేది లేదన్నారు.

షర్మిల ఆగ్రహం

కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే భూసేకరణకు ఇచ్చిన నోటిఫిషన్ ను రద్దు చేయండి. సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై కరేడు గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి. గ్రామ సభలు నిర్వహించండి. రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించండి. పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు అలా అని రైతుల శవాల మీద అక్రమంగా భూసేకరణ చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు” అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పోలీసుల అరెస్టులు – నిర్భందాలపై ఘాటు స్పందన

కరేడు గ్రామ ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, పోలీసులు వారిని అరెస్ట్ చేయడం, నిర్భంధించడం ప్రజాస్వామ్యానికి అవమానం అని షర్మిల మండిపడ్డారు. రైతుల గొంతును అణగదొక్కే ప్రయత్నాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఉద్యమాన్ని నిషేధించేందుకు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read hindi also: hindi.vaartha.com

Read also: Perni Nani: అరెస్ట్ కు నేను భయపడను ప్రభుత్వానికి సవాల్ చేసిన పేర్ని నాని

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870