हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YS Sharmila: చంద్రబాబు జగన్ లకు మోదీని ప్రశ్నించే దైర్యం లేదన్నషర్మిల

Ramya
YS Sharmila: చంద్రబాబు జగన్ లకు మోదీని ప్రశ్నించే దైర్యం లేదన్నషర్మిల

ఏపీ ప్రయోజనాల కోసం మోదీకి దాసోహం: షర్మిల ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీకి దాసోహమయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా (YS Sharmila) రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం జూన్ నెలలోనే 26 జిల్లాల్లో సుమారు 2,500 కిలోమీటర్లు పర్యటించినట్లు ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కినా, రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో లేరని షర్మిల ఆరోపించారు. రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే విభజన హామీలు అమలవుతాయని ఆమె గట్టిగా నొక్కి చెప్పారు.

YS Sharmila

మోదీ ముందు వంగిన చంద్రబాబు, జగన్

YS Sharmila: షర్మిల తన విమర్శల పదును పెంచుతూ, “కేంద్రంలో మోదీ అధికారంలో ఉండటానికి చంద్రబాబే కారణం. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన కేంద్రంపై కనీస ఒత్తిడి తీసుకురావడం లేదు” అని దుయ్యబట్టారు. మరోవైపు, కేంద్రం మెడలు వంచుతామని గొప్పలు చెప్పిన జగన్ (Jagan) చివరికి తన మెడనే మోదీ ముందు వంచారని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికీ మోదీని ఒక్క మాట అనకుండా, కేవలం చంద్రబాబు (Chandra babu) ను విమర్శిస్తూ దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకు కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా, రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా దానిపై మాట్లాడకపోవడం దారుణమని షర్మిల మండిపడ్డారు. రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇవ్వడమేంటని ఆమె ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామన్న హామీపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని గుర్తుచేశారు. విభజన హామీలు ఏవీ అమలు కాకపోయినా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోదీకి మద్దతు పలకడం విచారకరమన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి నుంచి బీజేపీని వ్యతిరేకించారని, కానీ జగన్ మాత్రం మోదీకి గులాంగిరీ చేశారని విమర్శించారు.

కాంగ్రెస్ పూర్వ వైభవం, అందరి సహకారం కావాలి

రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని వైఎస్ షర్మిల ధీమా వ్యక్తం చేశారు. “రాజకీయాలపై ఆసక్తి ఉండి, భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలనుకునే వారు, రాష్ట్రానికి సేవ చేయాలనుకునే వారు కాంగ్రెస్‌లోకి రావాలి. అందరం కలిసి పనిచేద్దాం” అని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్ (YSR) వంటి నేతల త్యాగాలతో నిండిన కాంగ్రెస్ పార్టీతోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్ర విభజన హామీలు పూర్తిగా అమలవుతాయని పేర్కొంటూ, సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ తిరిగి బలపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అందుకే రాష్ట్ర ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు రాష్ట్రంలో పటిష్టంగా ఉండేదని, ఆ రోజులు మళ్ళీ వస్తాయని షర్మిల విశ్వాసం వ్యక్తం చేశారు.

Read also: PVN Madhav: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎంపిక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870