ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిల
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదింపు పాపం ముమ్మాటికీ మాజీ సిఎం జగన్దేనని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. భారతీయ జనతాపార్టీ (Bharatiya Janata Party) కి అమ్ముడుపోయి మోడీ కోసం పోలవరం ప్రయోజనాలు తాకట్టు పెట్టి, ఇప్పుడు ప్రాజెక్ట్ ఎత్తు పెంచాలని జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని“ ఎక్స్” వేదికగా ఆమె విమర్శించారు.

పోలవరం నీటి నిల్వ సామర్థ్యం
వైఎస్సార్ కుమారుడై ఉండి ఐదేళ్ళ వైకాపా పాలనలో పోలవరంలో తట్టెడు మట్టి తీశారా? వైఎస్ ఆశయ సాధకుడివైతే పోలవరం ప్రాజెక్ట్ను (Polavaram project) ఎందుకు నిర్లక్ష్యం చేశారు? 2022లో పోలవరం నీటి నిల్వ సామర్థ్యం 41.15 మీటర్లకు కుదించిన పాపం మీ ప్రభుత్వానిది కాదా? అంచనా వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి రూ.37 వేల కోట్లకు తగ్గిస్తుంటే వేడుక చూసింది మీరు కాదా?’ అని షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. ‘కూటమి ప్రభుత్వం బనకచర్ల ప్రయత్నాలు ఆపి, ముందు పోల వరం ప్రాజెక్టు సంగతి తేల్చాలి. పాత డీపీఆర్ ప్రకారమే పోలవరాన్ని 45.7 మీటర్ల ఎత్తులో నిర్వహించాలి’అని షర్మిల డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది ప్రసిద్ధ వ్యక్తులు ఉన్నారు, ముఖ్యంగా రాజకీయ రంగంలో, వారి లో ముఖ్యులు:సర్వేపల్లి రాధాకృష్ణన్,నీలం సంజీవరెడ్డి,ఎం. వెంకయ్య నాయుడు,మాకినేని బసవపున్నయ్య,నారా చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్‌లో శక్తిమంతుడైన రాజు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గణపతి దేవుడు (Ganapathi Deva) అత్యంత శక్తిమంతుడైన రాజులలో ఒకరిగా ప్రసిద్ధుడు. ఆయన కాకతీయ వంశానికి చెందిన రాజు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Raghurama Krishna Raju: సైబర్ క్రైమ్స్ పై మరింత కఠిన చట్టాలు