ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పూర్తిగా ఆర్‌ఎస్‌ఎస్ వాదిగా మారిపోయారని, బీజేపీ మనిషిలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగం బదులు RSS సిద్ధాంతాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు.దళితవాడల్లో 5000 గుడులు నిర్మించాలని సీఎం తిరుపతిలో చేసిన ప్రకటనపై షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ఆమె అన్నారు. అన్ని మతాలకు సమాన గౌరవం ఉండాలని రాజ్యాంగం చెబుతుందని గుర్తు చేశారు. TTD దగ్గర డబ్బులు ఉంటే వాటిని దళితవాడల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని సూచించారు.
Balakrishna : బాలయ్య ఎపిసోడ్ కు తెరపడినట్లేనా!

దళితుల కోసం నిజంగా ఆలోచిస్తే అభివృద్ధి చేయాలి
గుడులు నిర్మించడానికి బదులుగా దళిత కాలనీల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతులను మెరుగుపరచాలని షర్మిల అన్నారు. మహిళా హాస్టళ్లలో ఒక బాత్‌రూమ్‌ను వందల మంది విద్యార్థినులు పంచుకోవాల్సిన పరిస్థితి ఉందని హైకోర్టు వ్యాఖ్యలు గుర్తుచేశారు. అలాంటి సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని చెప్పారు.RSS సిద్ధాంతంలో హిందువులకే ప్రాధాన్యం ఉంటుందని, ఇతర మతస్థులు పక్కన పడతారని షర్మిల విమర్శించారు. దళితవాడల్లో గుడులు కడితే పూజారులు ఎవరు అవుతారని ప్రశ్నించారు. నిజంగా దళితుల పట్ల శ్రద్ధ ఉంటే, వారి విద్య, ఉపాధి, వసతుల కోసం కృషి చేయాలని హితవుపలికారు.
బీజేపీపై షర్మిల ఫైర్
దేశంలో బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతోందని షర్మిల ఆరోపించారు. మతం పేరిట అల్లర్లు సృష్టించి లాభం పొందే పార్టీగా ఆమె పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో RSS అభ్యర్థికి చంద్రబాబు మద్దతు ఇవ్వడం ఆయన బీజేపీతో కలిసిపోయినట్లేనని అన్నారు.బీజేపీ ఓటు వ్యవస్థను కలుషితం చేసిందని షర్మిల ఆరోపించారు. గెలవలేని చోట దొంగ ఓట్లు చేర్చడం, ప్రతిపక్ష ఓట్లను తొలగించడం జరుగుతోందని తెలిపారు. మహారాష్ట్రలో 60 లక్షల ఓట్లు ఎన్నికలకు ముందే చేర్చారని ఆమె పేర్కొన్నారు.
EC బీజేపీ తొత్తుగా మారింది
ఎన్నికల సంఘం (EC) కూడా బీజేపీ గుప్పిట్లో ఉందని షర్మిల విమర్శించారు. రాహుల్ గాంధీ స్పష్టంగా ఓట్ల చోరీ ఉదాహరణలు ఇచ్చినా, EC స్పందించలేదని అన్నారు. ఎన్నికల రోజున లక్షల దొంగ ఓట్లు పోలయ్యాయని, సీసీ ఫుటేజ్ ఇవ్వమని అడిగినా స్పందన రాలేదని విమర్శించారు.తక్షణమే 5000 ఆలయాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, దళితవాడల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని షర్మిల కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు. అలాగే EC బీజేపీ ప్రభావం నుంచి బయటపడాలని కోరారు. ప్రజల ఓటు హక్కును కాపాడటమే నిజమైన ప్రజాస్వామ్యం అని గుర్తు చేశారు.
Read Also :